ప్రభాస్ - అనుష్క: కిక్కే కిక్కు!
టాలీవుడ్లో సుదీర్ఘ కాలం పాటు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్గా హవాను చూపించిన బ్యూటీ అనుష్క శెట్టి.
టాలీవుడ్లో సుదీర్ఘ కాలం పాటు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్గా హవాను చూపించిన బ్యూటీ అనుష్క శెట్టి. ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడిచినా ఆమె అందం అభినయంతో నేటితరం కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోంది. దీనికితోడు వరుసగా ఆఫర్లను అందుకుంది. అలా స్టార్‌డమ్‌ను అనుభవించింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అనుష్క శెట్టి సినిమాల వేగాన్ని బాగా తగ్గించేసింది.
అనుష్క శెట్టి గత ఏడాది వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ జోష్‌లోనే ఈ భామ.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘ఘాటి’ అనే సినిమాను చేస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టారు. బ్లాక్ బస్టర్ కాంబో కావడంతో ఈ సినిమాను హై రేంజ్‌లోనే తెరకెక్కిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి - టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కలిసి చేస్తున్న ‘ఘాటి’ సినిమా ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఓ నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చేసింది. ఓ అనుకోని ఘటన వల్ల ఓ సమస్యలో చిక్కుకుని అన్యాయానికి గురైన అమ్మాయి.. శత్రువులను మట్టబెట్టింది అనే కాన్సెప్టుతో ఇది రాబోతుంది.
ఎమోషనల్ సబ్జెక్టుతో రాబోతున్న ‘ఘాటి’ సినిమాకు సంబంధించిన అనుష్క శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇందులో ఆమె గంజాయి పీల్చుతున్న రెబెల్ లేడీలా దర్శనమిచ్చింది. అంతేకాదు, ఆమె ముఖం, చేతికి రక్తం కూడా కనిపించింది. దీంతో ఈ పోస్టర్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.
‘ఘాటి’ సినిమా నుంచి వచ్చిన అనుష్క శెట్టి ఫస్ట్ లుక్ చూసిన తర్వాత కొందరు ఔత్సాహికులు సరికొత్త చర్చను తెరపైకి తీసుకు వచ్చారు. అదేమిటంటే.. ఇటీవలే ‘ది రాజా సాబ్’ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. ఇందులో అతడు కూడా సిగార్ కాలుస్తూ ఉన్నాడు. దీంతో ఈ రెండు పోస్టర్లను పోలుస్తున్నారు. ప్రభాస్ మాదిరిగానే అనుష్క కూడా సిగార్ పట్టుకుని ఉండడాన్ని హైలైట్ చేస్తున్నారు.
మొత్తానికి అటు ప్రభాస్, ఇటు అనుష్క శెట్టి ధూమపానం చేస్తూ కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. ఇక, వీళ్లిద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని బాగా వైరల్ చేస్తూ కిక్కు మామూలుగా లేదని ఈ పోస్టర్లను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుంటున్నారు. ఫలితంగా ఈ రెండు సినిమాలు విడుదలకు ముందే ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.