పిక్ టాక్‌ : చిరు 'డాడీ' కూతురు అందంతో...!

ఆ సినిమాలో గింత ఉండేది ఇప్పుడు ఏంటి ఇంత అయ్యింది అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-07-16 12:30 GMT

పది, పదిహేను సంవత్సరాల క్రితం సినిమాల్లో చిన్న అమ్మాయి గా కనిపించిన వారు ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ, స్కిన్‌ షో చేస్తూ నెటిజన్స్ ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఆ సినిమాలో గింత ఉండేది ఇప్పుడు ఏంటి ఇంత అయ్యింది అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు అనుష్క మల్హోత్ర ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ అమ్మాయి ఫోటోలను తెలుగు ప్రేక్షకులు చూసి షాక్ అవుతున్నాయి. ఎందుకంటే దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఈ అమ్మాయి మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమాలో నటించింది.

చిరంజీవి కూతురు గా అనుష్క మల్హోత్రా ఆ సినిమాలో నటించింది. చిరు మరియు ఆ పాప మధ్య ఉండే బాండింగ్‌, ఇక గుమ్మాడి అనే పాట ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు. ఈతరం ప్రేక్షకులు కూడా సినిమాలో డాడీ సినిమాను చూసి మురిసి పోతూ ఉంటారు.

ఆ సినిమాలో చిరంజీవి కూతురు గా నటించిన అనుష్క మల్హోత్రా ఇప్పుడు పెద్ద అమ్మాయి అయ్యింది. పాతిక ఏళ్ల పడుచు అమ్మాయిగా అనుష్క మల్హోత్ర అందాల ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంది. నెట్టింట ఈమె ఈ మధ్య కాలంలోనే అడుగు పెట్టింది. తక్కువ సమయం లోనే భారీ మొత్తంలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.

తెలుగు ప్రేక్షకుల్లో మెల్ల మెల్లగా ఈమె గురించి తెలిసి, డాడీ కూతురు ఇంత అయ్యిందా అంటూ ఈమె సోషల్‌ మీడియా పేజ్ ని ఫాలో కొట్టడం మొదలు పెడుతున్నారు. భవిష్యత్తులో అనుష్క మల్హోత్ర సినిమాల్లో అడుగు పెట్టి, టాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించాలని కొందరు ఆశిస్తున్నారు. మరి అది అయ్యేనా అనేది కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News