అనుష్క‌ పాన్ ఇండియా సినిమాలు చేయ‌దా?

ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తే న‌టించేందుకు త‌న‌ను తాను సిద్ధం చేస్తున్నార‌ని స‌మాచారం.

Update: 2023-09-08 10:25 GMT

స్వీటీ అనుష్క శెట్టి న‌టించిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఇప్పుడు థియేటర్లలో రన్ అవుతోంది. ఇటీవ‌ల‌ అనుష్క త‌న సినిమాని ప్ర‌మోట్ చేస్తూ బిజీగా ఉంది. అయితే స్వీటీ అనుష్క పాన్ ఇండియా సినిమాల్లో న‌టించ‌డం లేదు ఎందుకని? అంటే దానికి స‌మాధానం ఇలా ఉంది.

బాహుబలి ఫ్రాంచైజీలో దేవసేనగా విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అనుష్క శెట్టి ఫ్రాంఛైజీ ఘ‌న‌విజయం తర్వాత అసాధారణమైన మార్గాన్ని ఎంచుకుంది. బాహుబ‌లి కోస్టార్లు ప్ర‌భాస్ - రానా ఇరుగు పొరుగు మార్కెట్ల‌లో దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. అనుష్క‌ శెట్టి కేవ‌లం తెలుగు- తమిళ సినిమాలకు మాత్ర‌మే అంకితమై ఉన్నారు. కానీ ఇటీవ‌ల త‌న ఆలోచ‌న మారింది. ఇత‌ర క‌థానాయిక‌ల్లానే ఇక‌పై దూసుకుపోవాల‌ని స్వీటీ భావిస్తోంది.

ఇటీవ‌ల ట్రెండ్ మారింది. ఏ భాషలోనైనా ఆడే యూనిక్ కాన్సెప్టుల‌తో ప్రాజెక్ట్‌లకు మ‌న మేక‌ర్స్ తెరతీశారు. అదే క్ర‌మంలో క‌థానాయిక‌ల‌కు పాన్ ఇండియా ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాల్లో అనుష్క ఎందుక‌నో పూర్తిగా వెన‌క‌బ‌డిపోయింద‌న్న‌ది అభిమానుల ఆవేద‌న‌కు ఇప్ప‌టికి స‌మాధానం వ‌చ్చింది. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో అనుష్క‌ శెట్టి బాహుబలి తర్వాత కొంత సమయం తీసుకోవాలనుకున్నాన‌ని ఎటువంటి స్క్రిప్ట్‌లను వినలేదని వెల్లడించారు.

ఈ విధానం పరిశ్రమలో అసాధారణం. ఆమె తన భవిష్యత్ ప్రాజెక్ట్‌ల కోసం ప్రస్తుతంలో ఉండాల‌ని భావించింది. ''నాకు ఆ మాత్రం సమయం కావాలి''అని స్వీటీ పేర్కొంది. ఇప్పుడు భారతీయ భాషలలో ఏదైనా ఎగ్జ‌యిట్ చేసే ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అనుష్క‌ పేర్కొంది. అనుష్క శెట్టి తెలుగు - తమిళ ప్రేక్షకులలో ఎల్లప్పుడూ ఆద‌ర‌ణ‌ పొందారు. ఇక‌పై హిందీ స‌హా ఇత‌ర భాష‌ల‌పైనా ఫోక‌స్ చేయ‌నున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తే న‌టించేందుకు త‌న‌ను తాను సిద్ధం చేస్తున్నార‌ని స‌మాచారం.

2018లో హిట్ అయిన తెలుగు చిత్రం భాగమతి ద్విభాషల్లో బాగానే ఆడింది. OTT విడుదలైన నిశ్శబ్ధం (2020)లో కనిపించిన‌ మూడు సంవత్సరాల తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో తిరిగి కంబ్యాక్ అయింది. రొమాంటిక్ కామెడీలో యువ‌హీరో నవీన్ పోలిశెట్టి స‌ర‌స‌న స్వీటీ న‌టించింది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డే 1 కలెక్షన్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఐదేళ్ల విరామం తర్వాత అనుష్క శెట్టి వెండితెరపైకి పునరాగమనం చేసింది. నవీన్ పొలిశెట్టి ఇందులో క‌థానాయ‌కుడు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న పాజిటివ్ రివ్యూలతో విడుదలైంది. Sacnilk.com నివేదిక ప్రకారం, ఈ చిత్రం థియేటర్లలో మొదటి రోజు 4 కోట్ల నికర వసూళ్ల‌ను సాధించింది. తమిళంలో కూడా డబ్ అయిన ఈ చిత్రం చెన్నై స‌హా ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఫ‌ర్వాలేద‌నిపించే వ‌సూళ్ల‌ను సాధించింద‌ని స‌మాచారం.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి గురువారం నాడు మొత్తం 39 శాతం తెలుగు ఆక్యుపెన్సీ ఉందని, తమిళ ఆక్యుపెన్సీ 18.16 శాతంగా ఉందని శాన్ సిల్క్ పోర్టల్ నివేదించింది. స్టూడియో ఫ్లిక్స్ వివ‌రాల‌ ప్రకారం.. ఈ చిత్రం మొదటి రోజు అమెరికాలో 300K డాల‌ర్ల‌ కంటే ఎక్కువ వసూలు చేసింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి షారూఖ్ ఖాన్ యాక్షన్ చిత్రం జవాన్‌తో పోటీప‌డుతూ విడుద‌లైంది. జ‌వాన్ అన్ని భాషలకు సంబంధించి మొదటి రోజు భారతదేశంలో దాదాపు 75 కోట్ల నికర వ‌సూళ్ల‌ను సాధించింది. జ‌వాన్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిందీ ఓపెనర్‌గా నిలిచింది.

యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. రొమాంటిక్ డ్రామాలో అనుష్క శెట్టి చెఫ్ పాత్రలో నటిస్తుంది. 40 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక మహిళ, వివాహం లేకుండా పిల్లలను కలిగి ఉండాలనుకుంటే ఆ త‌ర్వాత ఏమైంది? అన్న‌దే సినిమా. నవీన్ పోలిశెట్టి స్పెర్మ్ డోనర్ గా క‌నిపిస్తాడు. అత‌డు అనుష్క‌తో ప్రేమలో పడ్డాక విషయం క్లిష్టంగా మారుతుంది.

Tags:    

Similar News