పూరి రవితేజలకు అమ్మగా మారిన గ్లామరస్ హీరోయిన్

తరువాత మరల నేనింతే, దేవుడు చేసిన మనుషులు అనే సినిమాలు వీరిద్దరూ కలిసి చేసారు. అవి డిజాస్టర్ అయ్యాయి

Update: 2023-12-17 04:02 GMT

టాలీవుడ్ లో బెస్ట్ కాంబినేషన్ అంటే పూరి జగన్నాథ్, రవితేజ అని కచ్చితంగా చెబుతారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాల తర్వాత రవితేజ స్టార్ హీరోగా టాలీవుడ్ లో నిలబడిపోయాడు. పూరి జగన్నాథ్ కూడా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.

తరువాత మరల నేనింతే, దేవుడు చేసిన మనుషులు అనే సినిమాలు వీరిద్దరూ కలిసి చేసారు. అవి డిజాస్టర్ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీ గురించి తెలియాలంటే నేనింతే సినిమా చూడాలని ప్రతి ఒక్కరు చెబుతారు. అంతాగా మూవీ ఫ్లాప్ అయిన ఆడియన్స్ లోకి వెళ్ళిపోయింది. రవితేజ, పూరి జగన్నాథ్ కలిసి ప్రస్తుతం సినిమాలు చేయకున్న ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటారు.

వీరిద్దరూ టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ ని అమ్మ అని పిలుస్తారంట. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అనుష్క శెట్టిని పూరి, చార్మి, రవితేజ అమ్మ అని పిలుస్తారంట. ఆమె వ్యక్తిత్వం, ఆలోచనలు అంటే పూరికి చాలా ఇష్టం అంట.

అనుష్కని సూపర్ సినిమాతో పూరి జగన్నాథ్ హీరోయిన్ గా పరిచయం చేశారు. రవితేజతో విక్రమార్కుడు, బలాదూర్ చిత్రాలలో అనుష్క జోడీగా నటించింది. దీంతో వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. అనుష్కని కలిసిన ప్రతి సారి ఆమె కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా ఆమె చెప్పింది వినడానికి ఆసక్తి చూపిస్తామని పూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అనుష్కకి చాలా విషయాలపై అవగాహన ఉంటుందని పూరి తెలియజేశారు. స్టార్ హీరోయిన్ అయిన కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉండే నటీమణులలో అనుష్క ముందు వరుసలో ఉంటుంది. అలాగే ఫోటోషూట్ లకి, కమర్షియల్ ప్రమోషన్స్ కి ఆమె చాలా దూరంగా ఉంటారు. మీడియా దృష్టిలో కూడా పడరు. కేవలం సినిమా చేసినపుడు మాత్రం బయటకి వస్తారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న విశ్వంభర సినిమా కోసం అనుష్క పేరు పరిశీలిస్తున్నారు. మలయాళంలో ఒక సినిమాలో ఆమె నటిస్తోంది.

Tags:    

Similar News