అనుష్క ట్రాక్ ఎక్కితే వాళ్ల పరిస్థితి ఏంటి..?

సైజ్ జీతో తర్వాత అనుష్క వరుస సినిమాలు చేయకపోవడానికి కారణం ఆమె లుక్సే అని చెప్పొచ్చు.

Update: 2024-03-13 07:06 GMT

అటు అందంలోనూ అభినయంలోనూ తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకున్న హీరోయిన్ బెంగళూరు భామ అనుష్క శెట్టి. 2005 లో సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసిన స్వీటీ ఇప్పటికీ తన క్రేజ్ కొనసాగిస్తుంది. కథానాయికగా ఎలాంటి ప్రయోగానికైనా తాను సిద్ధం అనే వారిలో అనుష్క ఒకరు. అందుకే ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ క్రమంలోనే 2015 లో సైజ్ జీరో కోసం అనుష్క బరువు పెరిగింది. సినిమా కోసం రిస్క్ తీసుకుని మరి లావైన అనుష్క ఆ సైజ్ తగ్గించుకునేందుకు చాలా కష్టపడింది.

సైజ్ జీతో తర్వాత అనుష్క వరుస సినిమాలు చేయకపోవడానికి కారణం ఆమె లుక్సే అని చెప్పొచ్చు. అయినా కూడా ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ, బాహుబలి 2, భాగమతి సినిమాల్లో నటించింది అమ్మడు. 2019 లో వచ్చిన సైరా నరసింహా రెడ్డిలో కూడా క్యామియో రోల్ చేసి మెప్పించింది అనుష్క. 2020 లో నిశ్శబ్ధం సినిమా చేసిన అమ్మడు ఆ తర్వాత 3 ఏళ్లు కెరీర్ గ్యాప్ తీసుకుంది. లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం మలయాళంలో కథనార్ సినిమాలో నటిస్తుంది అనుష్క. 19 ఏళ్ల కెరీర్ లో అనుష్క చేస్తున్న మొదటి మలయాళ సినిమా ఇదే అవ్వడం విశేషం. అయితే అనుష్క తిరిగి ఫాం లోకి వచ్చేందుకు సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తుంది. అందం అభినయం రెండిటిలో అదరగొట్టే అనుష్క వరుస సినిమాలు చేస్తే మిగతా హీరోయిన్స్ కు చెక్ పెట్టినట్టే అని చెప్పొచ్చు. యువ హీరోయిన్స్, స్టార్ హీరోయిన్స్ వీళ్లంతా కూడా అనుష్క ట్రాక్ ఎక్కితే సైడ్ అవ్వాల్సిందే.

అనుష్క కెరీర్ గ్యాప్ వల్ల చాలామంది హీరోయిన్స్ కు మంచి అవకాశాలు దొరికాయి. మళ్లీ అనుష్క తిరిగి ఫాం లోకి వస్తే అందరిని పక్కకు నెట్టి మళ్లీ టాప్ ప్లేస్ ని సంపాదిస్తుందని చెప్పొచ్చు. అనుష్క చేస్తున్న మలయాళ సినిమా కథనార్ లో ఆమె డెవిల్ రోల్ చేస్తుందని టాక్. భయపెట్టేందుకు సిద్ధమవుతున్న అనుష్క ఆ సినిమాతో మరోసారి సౌత్ ఆడియన్స్ ని తన మాయలో పడేయాలని చూస్తుంది. తెలుగులో కూడా అనుష్క మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. అనుష్క తెలుగులో వరుస సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

Tags:    

Similar News