5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన స్వీటీ..?

నిశ్శబ్ధం తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న అనుష్క లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది.

Update: 2024-06-20 16:30 GMT

వరుసగా సినిమాలు చేసినా చేయకపోయినా కొంతమంది భామలకు ఎప్పటికీ ఒకే రేంజ్ పాపులారిటీ ఉంటుంది. వారు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమి లేకపోయినా జస్ట్ సినిమా చేస్తే చాలు అనుకునే అభిమానులను ఏర్పరచుకున్నారు. అందుకే కొంతమంది హీరోయిన్స్ కు ఎవరికీ లేనంత క్రేజ్ ఇమేజ్ ఉంటుంది. అలాంటి వారిలో స్వీటీ అనుష్క ఒకరు. నిశ్శబ్ధం తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న అనుష్క లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది.

ఆ సినిమాలో నవీన్ కి జతగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో వావ్ అనిపించింది అనుష్క. తెర మీద అనుష్క కనిపిస్తే చాలు అనుకునే ఫ్యాన్స్ ఉన్నారు. వారి కోసమే అనుష్క సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న అనుష్క ఆ సినిమాతో పాటు మలయాళంలో కూడా ఒక క్రేజీ సినిమాకు సైన్ చేసింది. ఇక ఇదిలా ఉంటే అనుష్కకు ఈమధ్య ఒక భారీ ఆఫర్ రాగా దాన్ని సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తుంది.

స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో కాంబినేషన్ లో ఒక భారీ సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమాలో అనుష్కని హీరోయిన్ గా తీసుకుంటే అడ్వాంటేజ్ అవుతుందని అనుకున్నారు. ఐతే సినిమాలో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యత లేదట. కేవలం గ్లామర్ కోసమే అనుష్కని పెట్టాలని అనుకున్నారట. అయితే ఈ విషయం గుర్తించిన అనుష్క ఆ ఆఫర్ ని కాదన్నదని తెలుస్తుని. దాదాపు 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పినా సరే దర్శక నిర్మాతలకు అనుష్క నో చెప్పేసిందట.

స్వీటీ అనుష్క ప్రస్తుతం తన ఫ్యాన్స్ ని అలరించే సినిమాలు చేయాలని అనుకుంటుంది. ముఖ్యంగా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో ఆకట్టుకోవాలని చూస్తుంది. ఐతే అనుష్క ఎలాంటి సినిమా చేసినా మాకు ఓకే అనేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. కమర్షియల్ సినిమాలను పూర్తిగా ఆపేయకుండా వాటిలో కూడా అనుష్క నటిస్తే చూడాలని కోరుతున్నారు స్వీటీ ఫ్యాన్స్. అనుష్క నుంచి రాబోతున్న రెండు సినిమాలు మెగా ప్లాన్ తోనే వస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే ఈ రెండు సినిమాలు పూర్తి చేశాకనే అనుష్క తన నెక్స్ట్ సినిమా ఓకే చేయాలని అనుకుంటుందట. ఇకమీదట కెరీర్ కి పెద్దగా గ్యాప్ ఇవ్వకూడదనే ఆలోచనతోనే అమ్మడు ఉన్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News