శంకర్ 'అప్పన్న' గేమ్!

తమన్ సంగీతం అందిస్తుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Update: 2024-11-11 16:35 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న గేమ్ ఛేంజర్ పై ఇప్పటికే చరణ్ ఫ్యాన్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ శంకర్ కొన్నాళ్లుగా తీస్తున్న చిత్రాలు.. మిస్ ఫైర్ అవుతుండడంతో కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో మేకర్స్.. టీజర్ ను విడుదల చేసి వారి డౌట్స్ ను క్లియర్ చేశారు. ఇప్పటికే ఉన్న అంచనాలను భారీగా పెంచేశారు.

ఇప్పటి వరకు మూవీలో చరణ్ డ్యుయల్ రోల్ పోషిస్తున్నారని వార్తలు రాగా.. టీజర్ లో మూడు షేడ్స్ లో కనిపించారు. యాక్టింగ్ తో మెప్పించారు. కాలేజీ స్టూడెంట్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా, పంచె కట్టుకుని రైతు కమ్ పొలిటికల్ లీడర్ అప్పన్న గా ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. దీంతో టీజర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో చరణ్ రోల్స్ కోసం తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. మూవీలో చరణ్ అప్పన్న రోల్ కీలకంగా ఉండనున్నట్లు అర్థమవుతుందని చెబుతున్నారు.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్.. అప్పన్న రోల్ లో కనిపించనున్నట్లు టీజర్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. అప్పన్న భార్యగా అంజలి నటించారని క్లారిటీ వచ్చింది. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అవుట్ పుట్ అదిరిపోయేలా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒక సామాజిక విషయంలో అప్పన్న పోరాడే తీరు వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. పోలీసులు అరెస్టు చేసేటప్పుడు అప్పన్న ఢీకొనే సీన్ మూవీకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

అందుకు సంబంధించిన చిన్న బీట్ ను మేకర్స్.. టీజర్ లో యాడ్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడే అప్పన్న క్యారెక్టర్ ముగుస్తుందని, అక్కడ మేకర్స్ ఇచ్చిన ట్విస్ట్ మూవీకి కీలకమని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. మూవీకి మెయిన్ అసెట్ గా నిలవనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ వింటేజ్ మార్క్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాగా కనిపిస్తుందట. దీంతో మూవీ హిట్ పక్కా అని అంటున్నారు.

అయితే శంకర్ గత చిత్రాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కు ఎలాంటి ఇంపాక్ట్ ఉందో అందరికీ తెలిసిందే. అదిరిపోయేలా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న శంకర్.. గేమ్ ఛేంజర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ విషయంలో ఎలాంటి పొరపాటు లేకుండా జాగ్రత్తగా డీల్ చేసినట్లు అర్థమవుతుంది. అప్పన్న క్యారెక్టర్.. సమాజంలోని కీలకమైన అంశాలను హైలెట్ చేసేలా డిజైన్ చేశారట. ఎమోషనల్ గా కూడా ఉంటుందని టాక్. మరి శంకర్.. గేమ్ ఛేంజర్ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News