హృదయాన్ని ఒక్క సెకను తాకితే... ఆమె వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏంటో?
ఇటీవలే వారిద్దరూ బ్రేకప్ అయ్యారని దాదాపుగా కన్ఫర్మ్ అయింది బాలీవుడ్ మీడియాలో ఆ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతోంది.
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, నటి మలైకా అరోరా గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే విషయం తెల్సిందే.. ఇటీవలే వారిద్దరూ బ్రేకప్ అయ్యారని దాదాపుగా కన్ఫర్మ్ అయింది. బాలీవుడ్ మీడియాలో ఆ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతోంది. తాను సింగిల్‌గా ఉన్నట్లుగా అర్జున్ కపూర్ ప్రకటించగా, మలైకా అరోరా సైతం తన సన్నిహితుల వద్ద మళ్లీ సింగిల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి తెగ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మలైకా అరోరా నుంచి వచ్చిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మలైకా సోషల్ మీడియా ద్వారా... హృదయాన్ని ఒక్క సెకను తాకితే అది జీవితాంతం ఆత్మను తాకవచ్చు అంటూ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది.. ఇంతకు ఆమె హృదయాన్ని తాకిన వారు ఇప్పటికి ఆమె ఆత్మతో ఉన్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బ్రేకప్ ను మలైకా అరోరా జీర్ణించుకోలేక పోతుందా.. ఆమెకు ఈ బ్రేకప్ ఇష్టం లేదా అంటూ కొందరు ఆ పోస్ట్ ను చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పోస్ట్ చేసిన ఒక్క లైన్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాతో పాటు, నెటిజన్స్ కి పెద్ద ప్రశ్నను వేసినట్లుగా ఆమె పోస్ట్ ఉందనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
సుదీర్ఘ కాలంగా కొనసాగిన మలైకా అరోరా, అర్జున్ కపూర్ ల ప్రేమ వ్యవహారంకు ఫుల్ స్టాప్ పడ్డట్లేనా అంటూ ఇంకా కొందరు అనుమానం గా ఉన్నారు. వారికి మలైకా పోస్ట్ స్పష్టత ఇచ్చినట్లు ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చక్కని జంట అంటూ పొగడ్తలు కురిపించిన వారు సైతం ఇప్పుడు ఇద్దరు విడిపోవడం మంచిది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు కచ్చితంగా గౌరవించుకోవాలి.. అలా కాకుంటే ఎప్పటికైనా రిలేషన్‌లో ఇబ్బందులు ఎదురు అవుతాయని మలైకా, అర్జున్ కపూర్ ల వ్యవహారం చూస్తూ అర్థం అవుతుంది.
ఇటీవల తండ్రిని కోల్పోయిన మలైకా అరోరా కి ప్రస్తుతం ఒక తోడు అవసరం ఉంది. అలాంటి సమయంలో అర్జున్ కపూర్ ఆమె వెంట లేక పోవడం దారుణం అంటూ కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మలైకా అరోరా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన పోస్ట్ గురించి పలువురు పలు రకాలుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆమె స్వయంగా మీడియా ముందుకు వచ్చి స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఆమె హృదయాన్ని తాకిన వారు ఎవరు, మరి ఆత్మను తాకడం జరిగిందా లేదా అనేది ఆమె క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.