300 టికెట్లతో 99.99శాతం నష్టాలు తెచ్చిన డిజాస్ట‌ర్

భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై డిజాస్ట‌ర్ గా నిలిచిన ఓ సినిమాకి కేవ‌లం 300 టికెట్లు తెగాయి.

Update: 2025-01-07 04:03 GMT

భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై డిజాస్ట‌ర్ గా నిలిచిన ఓ సినిమాకి కేవ‌లం 300 టికెట్లు తెగాయి. ఈ సినిమా కోసం ఏకంగా 45 కోట్ల బ‌డ్జెట్ ఖర్చు చేసిన నిర్మాత‌లకు బిగ్ లాస్ ఎదురైంది. పంపిణీదారులు 99.99 శాతం న‌ష్టాల‌తో ల‌బోదిబోమ‌న్నారు. అయితే ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా 2023 లో విడుద‌లైన క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం `ది లేడి కిల్ల‌ర్`. బోనీక‌పూర్ పుత్ర‌ర‌త్నం అర్జున్ కపూర్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు.

ఇందులో భూమి పెడ్నేక‌ర్ క‌థానాయిక‌. ఈ క్రైమ్ థ్రిల్లర్ విడుద‌లైందో లేదో కూడా తెలియ‌కుండా వ‌చ్చి వెళ్లింది. ఈ చిత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. భారతదేశం అంతటా కేవలం 293 టిక్కెట్లను విక్రయించి మొదటి రోజు రూ. 38 వేలు మాత్రమే సంపాదించింది. ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత దారుణ‌మైన బాక్సాఫీస్ వైఫల్యంగా నిలిచింది. 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ఫైనల్ గ్రాస్ నమ్మశక్యం కానంత త‌క్కువ‌.. దాదాపు 70 వేలు రూపాయలు సంపాదించింది.

3 నవంబర్ 2023న విడుదలైన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా కేవలం 12 షోలు మాత్రమే వేసారు. ఖర్చు ఎక్కువ కావడం, ఉత్తరాఖండ్‌లో వర్షం, రీషూట్‌లు కూడా చేయ‌క‌పోవడంతో ఈ సినిమా అసంపూర్తిగా విడుదలైనట్లు సమాచారం. ఫలితంగా నిర్మాణ బృందం అనేక ఎడిటింగ్ కట్‌లు .. వాయిస్ ఓవర్‌లపై ఆధారపడవలసి వచ్చింది. అసంపూర్తిగా ఉన్న షూట్‌లు, వాయిస్‌ఓవర్ లతో విడుద‌ల క‌గా.. క్రిటిక్స్, ప్రేక్షకులు తీవ్రంగా విమర్శించారు. అనంత‌రం ఈ చిత్రాన్ని ప్ర‌జ‌లు నిషేధించారు. అయితే అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్, ప్రియాంక బోస్ ల న‌ట‌ ప్రదర్శనలు ప్రశంసలు అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద అత్యంత దారుణ వైఫ‌ల్యం తర్వాత ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags:    

Similar News