ఈ సారి నిజంగానే విడిపోయారా?

మ‌లైకా అరోరా -క‌పూర్ జోడీ క‌లిసి ఉన్నారా? విడి విడిగా ఉంటున్నారా? అన్న‌ది కొన్ని నెల‌లుగా స‌స్పెన్స్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-05-31 11:23 GMT

మ‌లైకా అరోరా -క‌పూర్ జోడీ క‌లిసి ఉన్నారా? విడి విడిగా ఉంటున్నారా? అన్న‌ది కొన్ని నెల‌లుగా స‌స్పెన్స్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య మునుప‌టి అంత స‌ఖ్య‌త లేద‌ని బాలీవుడ్ మీడియా ఇప్పటికే ఎన్నోసార్లు కోడై కూసింది. సోష‌ల్ మీడియాలో కూడా క‌లిసిన మూవ్ మెంట్స్ ని ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా షేర్ చేయ‌డం లేదు. ఆరంభంలో చూపించినంత ఉత్సాహాన్ని ఇప్పుడు చూపించ‌డం లేదు అన్న‌ది వాస్త‌వం. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రికీ బ్రేక‌ప్ జ‌రిగింద‌ని రెండు..మూడు సార్లు నెట్టింట క‌థ‌నాలు వెడెక్కించాయి. కానీ అందులో వాస్త‌వం తెలియ‌ని ప‌రిస్థితి.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి విడిపోయిన‌ట్లు బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం ఠారెత్తిపోతుంది. వీరిద్ద‌రికీ సంబంధించి ఇండ‌స్ట్రీ-మీడియాకి మ‌ధ్య ఉన్న ఓ వ్య‌క్తి చెబుతున్న విష‌యం ఇలా ఉంది. ` ఇద్ద‌రి మ‌ధ్య ఎంతో అనుబంధం ఉంది. బ్రేక‌ప్ త‌ర్వాత కూడా దాన్ని కొన‌సాగిస్తున్నారు. ఒక‌రంటే ఒక‌రు గౌర‌వించుకుంటున్నారు. బ్రేక‌ప్ గురించి చెప్పాల‌నే ఆస‌క్తి వాళ్ల‌లో క‌నిపించ‌డం లేదు. దీని గురించి మీడియాలో చ‌ర్చ అవ‌స‌రం లేదు అని భావించే సైలెంట్ గా ఉన్న‌ట్లు` చెప్పుకొచ్చాడు.

అత‌డు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం చూస్తే ఇద్ద‌రు దూర‌మైన‌ట్లే క‌నిపిస్తుంది. ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా మూవ్ అవుతున్న‌ట్లు అత‌డి మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తుంది. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కూ నిజ‌మో తెలియాలంటే వాళ్లిద్ద‌రు లైన్ లో కి వ‌స్తేనే క్లారిటీ వ‌స్తుంది. 2019లో ఇద్ద‌రు డేటింగ్ లో ఉన్న‌ట్లు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్ప‌టి నుంచే ఇరువురు చెట్టా ప‌ట్టాలేసుకుని తిరిగిన వీడియోలు..పార్టీలు ప‌బ్ లు..లేట్ నైట్ పార్టీలంటూ చిక్కిన ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డం మొద‌లైంది.

ఇద్దరి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం భారీగా ఉండ‌టం స‌హా...అర్జున్ క‌పూర్ త‌న‌క‌న్నా 12 ఏళ్లు పెద్దైన మ‌లైకా తో డేటింగ్ మొద‌లు పెట్టేస‌రికి ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ చ‌రిత్ర‌లోనే అంత‌వ‌ర‌కూ ఏజోడీ పై రాన‌న్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా వాటిని ప‌ట్లించుకోకుండా రిలేష‌న్ షిప్ ని కొన‌సాగించారు.

Tags:    

Similar News