అదీ సంగతి: 10 సినిమాలకే అటకెక్కిన హీరో గారి కెరీర్
బాలీవుడ్ లోనే పెద్ద ఫెయిల్ అయిన నటవారసుడిగా అతడి కెరీర్ సాగుతోందని కూడా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.
ఎవరైనా నటవారసుడు లేదా సినీనేపథ్యం నుంచి వచ్చిన హీరో కొన్ని పరాజయాలు ఎదురైనా నిలదొక్కుకుని కొన్నాళ్ల పాటు మనుగడ సాగించే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత అయినా అతడు తనను తాను నిరూపించుకుని కెరీర్ పరంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. సదరు యువహీరో నటించిన చివరి 6-8 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలయ్యాయి. అతడి తదుపరి చిత్రం 'లేడీకిల్లర్' 80 శాతం షూటింగ్ పూర్తయింది. కానీ చివరి క్షణంలో T సిరీస్ యజమాని భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు.
సినిమా ఆశించిన స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయలేదు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను విరమించుకున్నానని అర్జున్ కపూర్‌తో నిర్మాత చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అర్జున్ కపూర్ తన నిర్మాతలకు సర్ధి చెప్పుకుని తిరిగి రిలీజయ్యేందుకు సహకరిస్తున్నాడని కూడా కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. పారితోషికం లో కొంత తిరిగి వెనక్కి ఇస్తానని భూషణ్‌తో చెప్పినట్టు కూడా కొన్ని మీడియాలు కథనాలు వేయడం ఇటీవల చర్చకు వచ్చింది. యువహీరో నటనకు భూషణ్ తీవ్ర నిరాశలో ఉన్నాడని కూడా ఈ కథనాల్లో వేయడం చర్చనీయాంశమైంది.
కానీ నిజం ఏమిటంటే అర్జున్ కపూర్ కోసం ఎవరూ ఆ సినిమా చూడరు. బాలీవుడ్ లోనే పెద్ద ఫెయిల్ అయిన నటవారసుడిగా అతడి కెరీర్ సాగుతోందని కూడా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఇది అర్జున్ కపూర్ కి చివరి చిత్రం కాబోతోంది అంటూ కొందరు విమర్శించడం కూడా హాట్ టాపిక్ అయింది. అతని చివరి చిత్రం 'ఏక్ విలన్ రిటర్న్స్' 60 కోట్ల బిజినెస్ చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇది కేవలం సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ కావడం వల్లనే అని అర్థం చేసుకోవాల్సి ఉంది. అర్జున్ కపూర్ కూడా మరో ఫెయిల్యూర్ నటుడు అంటూ ఇప్పుడు సరికొత్త ప్రచారం నెటిజనుల్లో సాగుతోంది.
అయితే అర్జున్ కపూర్ సినిమాల కంటే ఎఫైర్ల పైనే దృష్టి సారించడం కూడా ఈ రిజల్ట్ కి కారణమని కూడా కొందరు విశ్లేషించడం విశేషం. కపూర్ బోయ్ తనకంటే వయసులో ఎంతో పెద్దది అయిన మలైకా అరోరాతో ఎఫైర్ సాగించాడు. ఇటీవల మరో యువనటితో ప్రేమలో పడి, మలైకా నుంచి దూరమయ్యాడని కూడా కథనాలొచ్చాయి. అయితే అర్జున్ ఓవైపు మలైకాతో స్నేహంగా ఉంటూనే, మరోవైపు యువనటితో దూకుడుగా ఉన్నాడని కూడా గుసగుసలు వైరల్ అవుతున్నాయి. కారణం ఏదైనా బోనీ వారసుని కెరీర్ జర్నీ మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి వెళ్లడంలో ఈ ఎఫైర్ల బోగోతం ఒక కారణం అంటూ కొన్ని బాలీవుడ్ మీడియాలు కథనాలు వేయడం ఇటీవల చర్చకు వచ్చింది.