నా జీవితంలో తప్పులకు నేనే బాధ్యుడిని..'భగవంత్ కేసరి' విలన్..

నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి చిత్రంలో విలన్ గా నటించిన అర్జున్ రాంపాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే.

Update: 2024-07-31 11:30 GMT

నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి చిత్రంలో విలన్ గా నటించిన అర్జున్ రాంపాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. బాలీవుడ్ లో వరుస క్రేజీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ స్టార్ ఎందరో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటించాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఈ నటుడు తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందులో ఆయన తన మొదటి పెళ్లి గురించి కూడా ప్రస్తావించడం గమనార్హం.

వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతూ అర్జున్ రాంపాల్ తను చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను అన్న విషయాన్ని వెల్లడించారు. 24 సంవత్సరాలకే అర్జున్ మెహర్ జెసియాను పెళ్లి చేసుకుని వివాహ బంధంలో అడుగుపెట్టారు. అయితే పెళ్లికి ముందు ఎన్నో విషయాల గురించి అవగాహన ఉండాలని.. చిన్నవయసులో వైవాహిక బంధం లోకి అడుగు పెట్టడం వల్ల తాను ఎన్నో విషయాలను నేర్చుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నిజానికి అమ్మాయిలకంటే కూడా అబ్బాయిలలో పరిణతి నెమ్మదిగా వస్తుంది. మెహర్ తో నేను విడాకులు తీసుకున్నప్పుడు అందరికంటే ఎక్కువ సఫర్ అయింది మా పిల్లలు. వాళ్లు మానసికంగా ఎంతో ఇబ్బందికి గురయ్యారు.

1998లో పెళ్లి బంధంతో ఒకటైన అర్జున్,మెహర్ అనంతరం 20 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2018లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి అర్జున్ ఇద్దరు కుమార్తెలు తమ తల్లి వద్దనే ఉంటున్నారు. పెళ్లి తర్వాత తన జీవితంలో కొన్ని తప్పులు జరిగాయని పేర్కొన్న అర్జున్ వాటికి పూర్తి బాధ్యత తనదేనని చెప్పారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా మెహర్ తో తనకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది అని అర్జున్ పేర్కొన్నారు.

తన ప్రియురాలు గాబ్రియెల్లా గురించి ప్రస్తావించిన అర్జున్.. ఆమె దేవుడు అతనికి అందించిన రెండవ అవకాశమని పేర్కొన్నారు. ఇద్దరు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నామని.. మా మనసులు ఎప్పుడో కలిశాయని పేర్కొన్న అర్జున్ ఆ విధంగా తమకు పెళ్లి జరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ జంటకు 2019లో ఓ అబ్బాయి పుట్టాడు. బాలీవుడ్లో హీరోగా, మంచి విధంగా పేరు తెచ్చుకున్న అర్జున్ రాంపాల్ 'భగవంత్ కేసరి'తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఈ మూవీలో ప్రతి నాయకుడిగా అతని నటనకు మంచి మార్కులే పడ్డాయి.

Tags:    

Similar News