తప్పుడు కథనాలపై AR రెహమాన్ నోటీసులు
29 సంవత్సరాల సంసార జీవనం తర్వాత ఏ.ఆర్.రెహమాన్- సైరా బాను దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించారు.
29 సంవత్సరాల సంసార జీవనం తర్వాత ఏ.ఆర్.రెహమాన్- సైరా బాను దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన తర్వాత దీనికి కారణం ఫలానా అంటూ ఊహాజనిత కథనాలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఎలాంటి ఆధారాల్లేకుండా తనపై తప్పుడు కథనాలు ప్రచురించిన వారిపై ఏ.ఆర్.రెహమాన్ సీరియస్ అయ్యారు. తన వ్యక్తిగత జీవితం, విడాకుల గురించి ఊహాగానాలు సాగిస్తున్న వారందరికీ రెహమాన్ లీగల్ నోటీసు పంపారు. నవంబర్ 23న ఆస్కార్-విజేత సంగీత స్వరకర్త ``తన వ్యక్తిగత జీవితం గురించి ఊహాజనిత కథనాలను ప్రచురించిన వారిని ఆ వీడియోలు, కంటెంట్‌ను తీసివేయమని అన్ని యూట్యూబ్ ఛానెల్‌లు, ఆన్‌లైన్ ప్రచురణ సంస్థలను కోరుతూ ఒక చట్టపరమైన లేఖను రెహమాన్ సోషల్ మీడియాకు పంపారు.
లీగల్ నోటీస్ ప్రకారం.. విడాకులు, వ్యక్తిగత జీవితం గురించి పుకార్లు ప్రచారం చేసే వారికి 24 గంటల సమయం ఇస్తున్నానని ప్రకటించారు. ఆర్యకరంగా రెహమాన్ తన భార్య సైరా విడిపోవడం గురించి వార్తలను ప్రచురించిన కొన్ని గంటల తర్వాత, తన అసిస్టెంట్ అయిన బాసిస్ట్ మోహిని డే కూడా మార్క్ హార్ట్‌సుచ్‌తో తన వివాహం ముగిసిన విషయాన్ని వెల్లడించింది. రెండు ప్రకటనలు ఒకదానికొకటి గంటల వ్యవధిలో రావడంతో రెహమాన్-సైరా విడిపోవడానికి మోహిని డే తన భర్తతో విడిపోవడానికి మధ్య ఉన్న లింక్ గురించి నెటిజన్లు ఊహించారు.
అయితే తన తండ్రిపై వస్తున్న నిరాధార వార్తలను కుమారుడు AR అమీన్ ఇన్‌స్టాలో ఖండించారు. ఇవన్నీ నిరాధార వార్తలు అని తీవ్రంగా ఖండించారు. మా నాన్న ఒక లెజెండ్, అతడి అద్భుతమైన క్రియేటివిటీనే కాదు... సంవత్సరాలుగా సంపాదించిన విలువలు, గౌరవం, ప్రేమ కోసం..ఈ తప్పుడు ప్రచారం మానేయండి అని వ్యాఖ్యానించారు. తమ తండ్రి గోప్యతను కాపాడాలని రెహమాన్ కుమార్తెలు అభ్యర్థించారు.