రామ్ గోపాల్ వర్మకి పదిలక్షల ఫైన్!

Update: 2015-09-01 06:39 GMT
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఢిల్లీ హైకోర్టు 10లక్షల జరిమానా విదించింది. తమ షోలే సినిమాకు సంబందించిన కాపీ రైట్స్ ను వర్మ అతిక్రమించాడని షోలే సినిమా నిర్మాత కుమారుడు, మనవడు.. విజయ్ సిప్పీ, జీపీ సిప్పీలు కోర్టును ఆశ్రయించారు. పేరుకు "ఆగ్"అని పెట్టినా.. మా అనుమతి లేకుండా చిత్ర నేపథ్యం, పాత్రలు, సన్నివేశాలు, సంగీతం ఇలా దేన్నీ వదలకుండా వాడేసుకున్నాడని కోర్టుకు తెలిపారు. దీని పై స్పందించిన కోర్టు.. వర్మ చేసిన పని కాపీరైట్ హక్కుల ఉల్లంఘనలోకే వస్తుందని, ఉద్దేశపూర్వకంగానే ఈ అతిక్రమణ జరిగినట్లు ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టీస్ మన్మోహన్ సింగ్.. రామ్ గోపాల్ వర్మకు రూ.10 లక్షలు జరిమానా విదించారు!

కాగా... 1975లో విడుదలైన 40 సంవత్సరాలు పూర్తిచేసుకున్నా ఈ షోలే కి సోలో ఫ్యాన్స్ ఉన్నారన్నా కూడా అది అతిశయోక్తి కాదు! అయితే ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన సినిమాని 2007లో "ఆగ్"పేరుతో వర్మ రీమేక్ చేశాడు. అనంతరం ఫలితం దారుణంగా రావడంతోపాటు... వర్మ పై దేశవ్యాప్తంగా సినీ అభిమానులు విరుచుకుపడ్డారు! అనంతరం తేరుకున్న వర్మ... ఆ ప్రయత్నం ఒక చారిత్రక తప్పిందం అని చెప్పుకున్నాడు!
Tags:    

Similar News