ఠారెత్తిపోయేలా చ‌ర‌ణ్ -ఉపాస‌న‌ పెళ్లి వార్షికోత్స‌వం!

Update: 2022-06-13 05:50 GMT
రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తుల ధాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. న‌వ‌తరం టాలీవుడ్ ఆద‌ర్శ దంప‌తులుగానూ ఖ్యాతికెక్కారు. ఉపాస‌న సినిమా న‌టి కాక‌పోయినా టాలీవుడ్ లో ఆమెకున్న సెల‌బ్రిటీ ప‌రిచ‌యా లు..స్నేహితులు చాలా మందే ఉన్నారు. ఆ ర‌కంగా ఉప్సీ మెగా ఫ్యామిలీ ఇంట సెల‌బ్రిటీ కోడ‌లుగా  వెలిగిపోతున్నారు.

ఇక భ‌ర్త చ‌ర‌ణ్ ప‌ట్ల ఆమె ఎంతో కేరింగ్ గా ఉంటారు. భ‌ర్త‌ని పాపాయిలా ట్రీట్ చేస్తుంటారు. వృత్తి ప‌రంగా ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీ కంటూ ప్ర‌త్యేక‌మైన స‌మ‌యాన్ని కేటాయిస్తుంటారు. చ‌ర‌ణ్ సైతం భార్య ప‌ట్ల అంతే ప్రేమానురాగ‌ల‌తో  మెలుగుతారు. షూటింగ్ లు లేక టైమ్ దొరికితే గ‌నుక జంట‌గా విదేశాలు చెక్కేస్తారు.

ప్రస్తుతం ఈ జంట మూడ రోజుల క్రిత‌మే వెకేష‌న్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే సారి వివాహ వార్షికోత్సవాన్ని విదేశాల్లో ఘ‌న‌గా జ‌రుపుకోవ‌డానికి ప్లైట్ ఎక్కిన‌ట్లు తెలుస్తోంది. అవును జూన్ 14 ఈ జంట  పెళ్లి రోజు.   వివాహ బంధంలోకి అడుగు పెట్టి ఈ ఏడాదితో ద‌శాబ్ధం పూర్త‌వుతుంది. అందుకే ఈ ద‌శాబ్ధం మొత్తం గుర్తిండిపోయేలా జంట విదేశాల్లో వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు.

ఇక మెగా అభిమానులు  ఈ జంట కోసం ప్రత్యేక సామాజిక  కార్య‌క్ర‌మాలు చెప‌డుతున్నారు. రాష్ర్ట రామ్ చ‌ర‌ణ్ యువ‌శ‌క్తి సంఘం వివాహ వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుక‌ని రేప‌టి రోజున‌ పెద్ద ఎత్తున సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఓల్డేజ్ హోమ్ లో వృద్ధుల‌కు అన్న‌దానం చేస్తున్నారు. అలాగే చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంత‌పతులు నూరేళ్లు చ‌ల్ల‌గా ఉండాల‌ని కాంక్షిస్తూ ఈ జంట పేరిట ప్ర‌త్యేక‌మైన పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.

మెగా అభిమానులు చ‌ర‌ణ్‌-ఉపాస‌నల పేరిట వివాహ వార్షికోత్స‌వ ఉత్స‌వాలు ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ నిర్వ‌హించ‌లేదు. తొలిసారి జ‌ర‌ప‌డం ఇదే కావ‌డం విశేషం. వివాహం చేసుకుని 10 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగానే అభిమాన ంసంఘాలు ఇలాంటి వేడుక‌ల‌కు సిద్ద‌మైన‌ట్లు  తెలుస్తోంది. చ‌ర‌ణ్‌-ఉపాస‌న ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

న‌టుడిగా చ‌ర‌ణ్ చిరంజీవి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తుంటే..ఉపాస‌న  ఎంట‌ర్ ప్రెన్యూన‌ర్‌గా.. అపోలో లైఫ్ విభాగం వైస్ ఛైర్మన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.  అలాగే అపోలో తరపున  పలు సేవా కార్యక్రమాలు కూడా ఎప్పటిక‌ప్పుడు  చేప‌డుతుంటారు. ఇక రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 15వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే కొద్ది  భాగం షూటింగ్ పూర్త‌యింది. ఇటీవ‌లే షూటింగ్ కి  విరామం ఇవ్వ‌డంతో చ‌ర‌ణ్ స‌తీమ‌ణితో క‌లిసి ప్లైట్ ఎక్కారు. తిరిగొచ్చిన వెంట‌నే యధా విధిగా షూటింగ్ లో పాల్గొంటారు . ఈచిత్రాన్ని అన్ని ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయ‌నున్నారు.
Tags:    

Similar News