ఆగడు తర్వాత ప్లాన్‌ మారిపోయిందంతే

Update: 2015-12-29 13:29 GMT
14 రీల్స్ ఎంటర్ టెయిన్ మెంట్.. మహేష్ బాబుతో దూకుడు వంటి సూపర్ హిట్ తర్వాత.. టాలీవుడ్ లో 14 రీల్స్ ఎంటర్ టెయిన్ మెంట్స్ పేరు మార్మోగిపోయింది. అయితే.. ఆ తర్వాత వీళ్లు నిర్మించిన చిత్రాల్లో లెజెండ్ మినహా.. మిగతావేవీ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. ముఖ్యంగా వన్ నేనొక్కడినే - ఆగడు తీవ్ర నిరాశను మిగిల్చాయి.

ఆగడు తర్వాత మరో భారీ చిత్రం తీయలేదంటేనే.. వీరి వ్యూహం ఏ స్థాయిలో మారిందో అర్ధమవుతుంది. ఇప్పుడు వీరు ఒకేసారి ఆరు సినిమాల నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తుండడం విశేషం. నారా రోహిత్ - సందీప్ - సునీల్ - నాని - అల్లరి నరేష్.. వంటి హీరోలతో ఒకేసారి మూవీస్ చేస్తున్నారు. ఇవన్నీ పది కోట్ల లోపు బడ్జెట్ తో పూర్తయ్యే సినిమాలే కావడం గమనార్హం. రెమ్యూనరేషన్స్. నిర్మాణ ఖర్చులు కలుపుకున్నా.. పది కోట్ల మార్క్ ను మించే ఛాన్స్ ఉండదు. అంతకుముందు వీరి తీసిన చిత్రాలన్నీ 50-60 కోట్ల బడ్జెట్ తో తీసినవే. ఇప్పుడదే బడ్జెట్ తో అర డజన్ సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. వీటిలో సగం సక్సెస్ అయినా.. పెట్టుబడి సేఫ్ గా ఉంటుందని చెప్పచ్చు.

అంటే.. , ఆగడు తర్వాత 14రీల్స్ ఎంటర్ టెయిన్ మెంట్స్.. తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసుకుని.. మీడియం, లోబడ్జెట్ చిత్రాలకు వచ్చేసింది. కానీ హై ఎండ్ వాల్యూస్ తో సినిమాలు తీయగల నిర్మాతలు.. చిన్న సినిమాల వైపు మొగ్గు చూపడం మాత్రం స్వాగతించాల్సిన విషయం. ఇక నుంచి మాత్రం పెద్ద సినిమాల విషయంలో కేర్ ఎక్కువ తీసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది.
Tags:    

Similar News