చాలా అందంగా ఉన్నావు.. రష్మికపై ఆలియా కామెంట్‌

ఛావా సినిమాను ఎంతో మంది బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ప్రశంసిస్తూ సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయంను చెబుతున్నారు.

Update: 2025-02-20 14:30 GMT

బాలీవుడ్‌కి 'ఛావా' రూపంలో మరో భారీ విజయం దక్కింది. ఈ ఏడాదిలో ఒక్క విజయం కూడా దక్కలేదు అనుకుంటున్న సమయంలో విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న నటించిన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే దిశగా దూసుకు పోతుంది. వారం కూడా తిరగకుండానే ఛావా సినిమా రూ.200 కోట్లకు మించి వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. విక్కీ కౌశల్‌ నటనకు జాతీయ అవార్డు ఖాయం అంటూ ఎంతో మంది రివ్యూవర్స్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో యేసుబాయి పాత్రలో నటించిన రష్మిక మందన్న సైతం అద్భుతమైన నటనతో మెప్పించింది అంటూ సినీ ప్రేమికులు, విశ్లేషకులు అంటున్నారు.


ఛావా సినిమాను ఎంతో మంది బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ప్రశంసిస్తూ సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయంను చెబుతున్నారు. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ సైతం ఛావా సినిమాపై తన అభిప్రాయంను వ్యక్తం చేశారు. ఔరంగజేబ్‌ పాత్రలో నటించిన అక్షయ్‌ ఖన్నా అద్భుతంగా నటించారని ఆలియా భట్‌ ప్రశంసించింది. అక్షయ్‌ ఖన్నాను తన అభిమాన నటుడిగా ఆలియా భట్ పేర్కొంది. అంతే కాకుండా హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నపైనా ఆలియా భట్‌ ప్రశంసలు కురిపించింది. చాలా అందంగా ఉన్నావు, నీ కళ్లు అంటూ ఆలియా చేసిన ప్రశంసలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌కి ఆలియా భట్‌ కంగ్రాట్స్ చెప్పింది. అద్భుతమైన సినిమాను రూపొందించిన మీకు ముందు ముందు మరిన్ని విజయాలు దక్కుతాయనే నమ్మకంను వ్యక్తం చేసింది. ఆలియా భట్‌ ఛావా సినిమా గురించి చేసిన పోస్ట్‌ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా ఆలియా భట్ ఇతర సినిమాల గురించి చాలా అరుదుగా మాత్రమే స్పందిస్తూ ఉంటుంది. ఛావా సినిమా తన మనసుకు నచ్చడం వల్లే ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించింది అంటూ ఆమె అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హిందువులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్‌ చూసే విధంగా ఛావా సినిమా ఉందంటూ సోషల్‌ మీడియా ద్వారా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, గోవా రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ముందు ముందు మరిన్ని రాష్ట్రాలు సైతం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రష్మిక మందన్న పుష్ప 2 తర్వాత మరో భారీ విజయాన్ని ఛావా సినిమాతో తన ఖాతాలో వేసుకుంది. సౌత్‌ ఇండియన్‌ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News