బిగ్ బాస్ రియాలిటీ షో పై ఎన్ని వివాదాలు ముసురుకుంటున్నా.. విమర్శలు పెరుగుతున్నా ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. తెలుగు బిగ్ బాస్ 3 ఈ ఆదివారం నాడు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 'కింగ్' అక్కినేని నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించనుండడం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింతగా పెంచుతోంది. గతంలో ఆయన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను తనదైన శైలిలో రక్తి కట్టించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అయన బిగ్ బాస్ కు ప్రధాన ఆకర్షణగా మారతారనే అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే ఈ షోలో పాల్గొనబోయే బిగ్ బాస్ ఇంటి సభ్యుల గురించి భారీగా ఊహాగానాలు.. చర్చలు సాగుతున్నాయి. బిగ్ బాస్ వారు ఇప్పటివరకూ పార్టిసిపెంట్స్ ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు తాజాగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ల లిస్టు అంటూ 15 మంది పేర్లను వెల్లడించాడు. వీరిలో హేమ.. శ్రీముఖి.. తీన్‌మార్ సావిత్రి.. హిమజ.. యాంకర్ జాఫర్.. నటి పునర్నవి.. డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్..వరుణ్ సందేశ్.. వితికా శేరు.. సీరియల్ నటుడు రవికృష్ణ.. సీరియల్ నటుడు అలీ రేజా.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. యూట్యూబ్ కామెడీ స్టార్ మహేష్.. సీరియల్ నటి రోహిణి.. అశు రెడ్డి ఉన్నారు.
వీరిలో మెజారిటీ సభ్యుల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరి నూతన్ నాయుడు రిలీజ్ చేసిన బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ల లిస్టు నిజమౌతుందా.. లేదా వీటిలో మార్పుచేర్పులు ఉంటాయా అనేది మనకు ఆదివారం నాడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.