స్టార్ హీరోకు 17 రోజులకు 17 కోట్లు అదనం..!

Update: 2021-11-03 10:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగా తీసుకునే హీరోలు కూడా ఉన్నారు. అయితే అందులో ఓ స్టార్ హీరో రోజుకు ఒక కోటి వరకు ఛార్జ్ చేస్తున్నాడు. సినిమాకు ఎన్ని రోజులు కాల్షీట్స్ కేటాయిస్తే అన్ని కోట్లు అన్నమాట. వరుస సినిమాలు లైన్ లో పెడుతున్న ఆ హీరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకొచ్చారు.

అందులో ఒక సినిమా సగానికి పైగా షూటింగ్ జరుపుకోగా.. మరో మూవీ ఫైనల్ స్టేజీకి వచ్చేసింది. మరొక మేజర్ షెడ్యూల్ షూటింగ్ చేస్తే చిత్రీకరణ మొత్తం అయిపోతుందనగా.. ఇప్పుడు కొన్ని సీన్స్ ని రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో స్టార్ హీరోవి అదనంగా మరో 17 రోజుల కాల్షీట్స్ అవసరమయ్యే పరిస్థితి వచ్చిందట.

స్టార్ హీరోతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ని నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హీరో మార్కెట్ కి ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారు. దీనికి తగ్గట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతోంది. అంతా బాగానే జరుగుతుందని అనుకుంటుండగా.. మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ సినిమాలో కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని డిసైడ్ అయ్యారట.

అవుట్ ఫుట్ సరిగా లేకనా? టెక్నికల్ టీమ్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ వల్లనా? అనేది తెలియదు కానీ.. కొన్ని సన్నివేశాలను మళ్ళీ చిత్రీకరిస్తున్నారట. ఈ మేరకు హీరోని కూడా ఒప్పించారట. సాధారణంగా ఇతర సినిమాలకు యాభై కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే సదరు హీరో.. ఈ సినిమా మేకర్స్ హితులు సన్నిహితులే కావడంతో 40 కోట్లకే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ విధంగానే అతను షూటింగ్ లో కూడా పాల్గొన్నారు.

అయితే ఇప్పుడు మరో 17 రోజుల హీరో డేట్స్ కావాల్సి వచ్చింది. ప్రెజెంట్ ఆయన ఉన్న బిజీకి మళ్ళీ డేట్స్ దొరకడం చాలా కష్టం. అయితే వారి మధ్య సాన్నిహిత్యంతో రోజుకు కోటి లెక్కన చెల్లించేలా హీరోని నిర్మాతలు ఒప్పించారట. తనతో క్లోజ్ గా ఉండేవారు కావడంతో బిజీ షెడ్యూల్ లో కూడా అదనపు కాల్షీట్స్ ఇవ్వడానికి స్టార్ హీరో రెడీ అయ్యారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు - టీజర్లు పాటలు సినిమాపై అంచనాలు కలిగించాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News