కన్నడ స్టార్స్‌ కు ఐటీ షాక్‌ - సీఎం భార్యపై కూడా

Update: 2019-01-03 08:57 GMT
కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన స్టార్స్‌ పై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. గురువారం తెల్లవారు జామున మూడు నాలుగు గంటల నుండే పెద్ద మొత్తంలో ఐటీ విభాగంకు చెందిన వారు టీంలుగా విడిపోయి సినీ స్టార్స్‌ ఇళ్లపై మూకుమ్మడి ఐటీ దాడులు నిర్వహించారు. ఒకరి నుండి ఒకరికి సమాచారం అందకుండా ఒకేసారి అందరిపై ఐటీ దాడులు జరగడంతో స్టార్స్‌ ఇళ్లలో ఉన్న బ్లాక్‌ మనీ మరియు పన్ను చెల్లించని ఆస్తులు బయట పడుతున్నట్లుగా కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కేజీఎఫ్‌ తో సూపర్‌ హిట్‌ ను అందుకుని 160 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న హీరో యష్‌ తో పాటు - ఆ చిత్ర నిర్మాత ఇంటిపై దాడులు జరిగాయి. ఇంకా పునీత్‌ రాజ్‌ కుమార్‌ - శివ రాజ్‌ కుమార్‌ ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి రెండవ భార్య రాధిక ఇంటిపై కూడా ఐటీ దాడులు జరగడం సంచలనం రేపుతోంది. ఈ ఐటీ దాడుల గురించి కర్ణాటక ప్రభుత్వంకు కూడా ఎలాంటి సమాచారం లేదని కన్నడ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర ముఖ్య ప్రాంతాలు కలిపి ఒకే సారి 60 చోట్ల ఐటీ దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ రైడ్స్‌ ఇంకా కొనసాగుతున్నాయి. నేడు సాయంత్రం వరకు ఎవరి వద్ద ఎంత బ్లాక్‌ ఉంది, ఎవరు పన్ను ఎగవేస్తున్నారనే సమాచారం పూర్తిగా వచ్చే అవకాశం ఉందని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఐటీ దాడులపై కన్నడ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది - కేంద్రం కావాలని ఇలా చేయిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెల్లవారు జామునే బెంగళూరుతో పాటు కర్ణాటక మొత్తం ఉలిక్కిపడేలా ఐటీ రైడ్స్‌ మొదలయ్యాయి.



Full View

Tags:    

Similar News