ఏయ్ చికితా! 21ఏళ్ల వెన‌క్కు వెళ్లిన రేణు దేశాయ్!!

Update: 2021-04-20 11:30 GMT
ఏయ్ చికితా కుమస్తాస్ .. బ‌ద్రి నుంచి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ ఇది. ర‌మ‌ణ గోగుల మైండ్ బ్లోవింగ్ మ్యూజిక్ తో ఆల్బ‌మ్ ని ర‌క్తి క‌ట్టించారు. ఇందులో చికితా సాంగ్ ఫ్యాన్స్ మెమ‌రీ నుంచి ఎప్ప‌టికీ తొల‌గిపోదు. అంత‌టి పెప్ ఆ పాట‌లో ఉంటుంది. అలాగే ప‌వన్ - అమీషా ప‌టేల్ జంట‌పై తెర‌కెక్కించిన చికితా పాట‌ విజువ‌ల్ గానూ  మేకింగ్ ప‌రంగా సంథింగ్ స్పెష‌ల్.

బ్లూ డెనిమ్ జీన్స్ లో హ్యాట్ ధ‌రించి కౌబోయ్ లా ప‌వ‌న్ గెట‌ప్ అద్భుతంగా ఉంటుంది. అమీషా లుక్ అంతే హాట్ గా క‌వ్విస్తుంది. ఈ పాట‌కు కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేసింది రేణు దేశాయ్. ఇక పాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో మ‌ర‌పు రాని మెమ‌రీస్ ని నేడు రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు. ఆన్ లొకేష‌న్ నాటి ఫోటోని షేర్ చేసి స‌రిగ్గా 21 సంవ‌త్స‌రాల నాడు ఈ సినిమా రిలీజైంద‌ని తెలిపారు. అప్ప‌ట్లో ప‌వ‌న్- అమీషా జంట‌పై పాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో రేణు ఓ స్నాప్ లో ఇలా క‌నిపించారు.

పవన్ ఈ ఫోటోలో స్టైలిష్ లుక్ తో క‌నిపించ‌డ‌మే కాదు.. రైఫిల్ పట్టుకొని ఫోజులిస్తుంటే రేణు త‌న‌ ముఖాన్ని పారదర్శక దుప్పట్టతో కప్పుకుని క‌నిపించారు. అంత‌లోనే ఫోటో అలా క్లిక్క‌య్యింది. ``నా దుపట్టా నా సన్ స్క్రీన్ వెర్షన్… చికితా షూట్ సమయంలో ఫోటోబాంబింగ్ జరుగుతోంది. #21 వసంతాల బద్రీ.. మెమ‌రీస్ ఫ‌ర్ లైఫ్ ! అంటూ ఈ ఫోటోకి రేణు శీర్షిక ఇచ్చారు.

రేణు దేశాయ్- అమీషా పటేల్ ఈ రొమాంటిక్ డ్రామాలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ స‌ర‌స‌న న‌టించారు. ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. పూరి జ‌గ‌న్నాథ్ ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంతోనే ద‌ర్శ‌కుడిగా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించారు. బ‌ద్రి ఇటు పూరీకి అటు ప‌వ‌న్ కి కెరీర్ లో మ‌రిచిపోలేని గ్రేట్ మూవీ.
Tags:    

Similar News