నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. నేటితో హీరోగా 22 ఏళ్ళ సినీ కెరీర్ ని పూర్తి చేసుకున్నాడు. తాత పోలికలు పునికి పుచ్చుకోవడమే కాదు.. అద్భుతమైన నటనలో డైలాగ్ డెలివరీలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. డ్యాన్సులలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు యంగ్ టైగర్. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు.
ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చినప్పటికీ తారక్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఎన్ని విజయాలు అందుకున్నాడో అంతకన్నా పరాజయాలు చవిచూశాడు. నూనూగు మీసాల వయసులోనే బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.. డిజాస్టర్స్ ఎలా ఉంటాయో రుచి చూసాడు. ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా తట్టుకొని ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నాడు. గత కొన్నేళ్లుగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవలి RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ‘రామాయణం’ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన ఎన్టీఆర్.. 2001 లో 'నిన్ను చూడాలని' అనే చిత్రంతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. వి.ఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామోజీ రావు నిర్మించాడు. ఇది అశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో నందమూరి వారసుడికి నిరాశే ఎదురైంది. అయితే వెంటనే ఎస్ఎస్. రాజమౌళిని దర్శకుడిగా చేస్తూ, తారక్ నటించిన 'స్టూడెంట్ నెం.1' చిత్రం హీరోగా తొలి విజయాన్ని అందించింది.
ఇదే క్రమంలో తారక్ చేసిన 'సుబ్బు' సినిమా ఫ్లాప్ అవ్వగా.. వివి వినాయక్ దర్శకత్వంలో నటించిన 'ఆది' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీని తర్వాత వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ ‘నాగ’ సినిమాలు మాత్రం బోల్తా కొట్టాయి. అయితే రాజమౌళితో కలిసి చేసిన ‘సింహాద్రి’ సినిమాతో తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు ఎన్టీఆర్. కానీ వెంటనే భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఆంధ్రావాలా’ చిత్రం పెద్ద ప్లాప్ గా నిలిచింది.
‘ఆంధ్రావాలా’ మూవీ ఆడియో ఫంక్షన్ కు 10లక్షల మందికి పైగా జనాలు వచ్చారంటే అప్పట్లోనే తారక్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే యంగ్ టైగర్ ఆ తరువాత వరుసగా మరో అర డజను పరాజయాలు రావడంతో రేసులో కాస్త వెనుకబడ్డాడు. ‘సాంబ’ ‘నా అల్లుడు’ ‘నరసింహుడు’ ‘అశోక్’ ‘రాఖీ’ వంటి సినిమాలు తీవ్ర నిరాశ పరిచాయి. అలాంటి పరిస్థితుల్లో జక్కన్న సలహాతో సన్నగా మారి ‘యమదొంగ’ సినిమాతో హిట్టు కొట్టాడు. కానీ వెంటనే ‘కంత్రి’ తో ప్లాప్ అందుకోవాల్సి వచ్చింది.
దీని తర్వాత ‘అదుర్స్’ ‘బృందావనం’ వంటి వరుస విజయాలు సాధించాడు తారక్. అయితే ‘శక్తి’ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవగా. ‘ఊసరవెల్లి’ ‘దమ్ము’ చిత్రాలు కూడా అదే బాటలో నడిచాయి. ఈ క్రమంలో వచ్చిన ‘బాద్ షా’ చిత్రం పర్వాలేదనిపించగా.. ‘రామయ్యా వస్తావయ్యా’ ‘రభస’ సినిమాలు మళ్ళీ తీవ్రంగా నిరాశపరిచాయి. అలాంటి టైంలో వచ్చిన 'టెంపర్' చిత్రం ఎన్టీఆర్ ని పూర్తిగా మార్చేసింది.
అప్పటి నుంచి తారక్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ బ్యాక్ ఓ బ్యాక్ హిట్లతో దూసుకెళ్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ ‘జనతా గ్యారెజ్’ ‘జై లవకుశ’ ‘అరవింద సమేత’ వంటి సినిమాలు వరుసగా విజయాలు సాధించాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమాస్ ఎన్టీఆర్ ను సరికొత్త పాన్ ఇండియా స్టార్ ని చేసింది.
‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు.. ఓటీటీలో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు నాటు నాటు డ్యాన్సులకు వెస్టర్న్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. దీంతో ఇప్పుడు ఆ ఇమేజ్ ని కాపాడుకునేలా తారక్ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వంలో NTR30 అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారు.
ఇలా హీరోగా 22 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకొని మరిన్ని మైలురాళ్ళు అధిగమించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలనటుడి నుంచి భారతీయ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడాన్ని కొనియాడుతూ.. #22GloriousYearsOfNTR అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.