పారిస్ లో 2.0 రేర్ ఫీట్

Update: 2018-12-04 14:30 GMT
రోజు కో వంద కోట్ల గ్రాస్ చొప్పున మొదటి నాలుగు రోజులు దుమ్ము దులిపిన సూపర్ స్టార్ రజనికాంత్ 2.0 వీక్ డేస్ లో నేమ్మదించినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. పెట్టుబడి లెక్కల్లో ఎంత వరకు ఇది సేఫ్ గా నిలుస్తుందనే క్లారిటీ రావడానికి ఇంకా టైం పడుతుంది కాని మరో అరుదైన ఘనత 2.0 దక్కించుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ధియేటర్లలో ఒకటైన లా గ్రాండ్ రెక్స్ పారిస్ లో ఉంది. దాని సీటింగ్ కెపాసిటీ 2800 సీట్లు. యూరోప్ ఖండం మొత్తం మీద భారీ సినిమా హాల్ ఇదొక్కటే.

ఇందులో నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా 2.0 విడుదలలో భాగంగా ఇందులో కూడా స్క్రీనింగ్ వేసారు. మాములుగా ఇక్కడ భారతీయ సినిమాలు అరుదు గా ప్రదర్శిస్తారు. ఇంతకు ముందు ఈ సత్కారాన్ని కబాలి-మేర్సల్ తో పాటు అతి కొద్ది తమిళ సినిమాలు మాత్రమే పొందాయి. అయితే అవి పరిమిత ప్రదర్శనలకు మాత్రమే పరిమితమయ్యాయి. కాని 2.0 ఇక్కడే మరో ఘనత సాధించింది. ఏకంగా డిసెంబర్ 8 దాకా ప్రదర్శన జరపబోతున్నట్టు ధియేటర్ యాజమాన్యం ట్వీట్ చేసింది. రోజుకు ఎన్ని షోలు అనే వివరాలు తెలియలేదు కాని ఒక ఇండియన్ మూవీ లా గ్రాండ్ రెక్స్ లో 9 రోజుల పాటు ప్రదర్శింపబడటం మాత్రం అరుదైన రికార్డు.

ఇది తలైవా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేదే. మెర్సల్ ఒక రోజు వేసినప్పుడే విజయ్ ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇప్పుడు ఏకంగా వారం పైగా నే ప్రదర్శన అంటే రజని అభిమానులకు అంత కంటే కావాల్సింది ఏముంటుంది. ఇలాంటి విశేషాలు 2.0 చాలానే మూటగట్టుకుంటోంది కాని ఆరు వందల కోట్ల పెట్టుబడిని వెనక్కు వచ్చే రేంజ్ లో ఆడుతుందా అనే అనుమానం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది
Tags:    

Similar News