వాళ్ల‌ని సైతం రాజ‌మౌళి దారిలో పెడుతున్నారా?

లెజెండ్లు ఊర‌క‌నే ఎవ్వ‌రూ అయిపోరు. ఎంత ట్యాలెంట్ ఉన్నా? ఒదిగి ఉండ‌టం అన్న‌ది లెజెండ్ల‌ల‌లో గొప్ప లక్ష‌ణం.

Update: 2025-01-04 08:30 GMT

లెజెండ్లు ఊర‌క‌నే ఎవ్వ‌రూ అయిపోరు. ఎంత ట్యాలెంట్ ఉన్నా? ఒదిగి ఉండ‌టం అన్న‌ది లెజెండ్ల‌ల‌లో గొప్ప లక్ష‌ణం. బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్, మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ వీళ్లంతా లెజెండ్లు అయ్యారంటే? కార‌ణంగా ఆ ఒదిగి ఉండే ల‌క్ష‌ణం కూడా ఒక్క‌టి. లెజెండ‌రీలు అయినా ఇప్ప‌టికీ తాము ఎలా ఎదిగాం అన్న‌ది సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తీసారి చెబుతుంటారు. త‌మ సీనియ‌ర్ల‌కు వాళ్లే ఇచ్చి రెస్పెక్ట్.. వాళ్ల గురించి మాట్లాడే విధానం చూస్తే అందుకే వీళ్లు వాళ్ల స‌ర‌స‌న చేరారు అనిపిస్తుంది.

తాజాగా ఇండియ‌న్ గ్రేట్ డైరెక్ట‌ర్లు శంక‌ర్- రాజ‌మౌళి ఒక‌రి గురించి ఒకరు `గేమ్ ఛేంజ‌ర్` ప్రెస్ మీట్ లో ఎలా మాట్లాడుకున్నార‌న్న‌ది తెలిసిందే. తాను అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఉన్న‌ప్పుడు శంక‌ర్ ను తాను స్పూర్తిగా భావించిన‌ట్లు చెప్పారు. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా కీర్తించారు. ఇక రాజ‌మౌళి భార‌తీయ చిత్రాన్ని ఏకంగా హాలీవుడ్ కి తీసుకెళ్లార‌ని శంక‌ర్ కూడా అంతే గొప్ప‌గా భావించారు. త‌న సినిమా ట్రైల‌ర్ జ‌క్క‌న్న చేతుల మీదుగా రిలీజ్ అవ్వ‌డంతో ఎంతో గౌర‌వంగా భావించారు.

ఈ రెండు సంద‌ర్భాలు చాల‌వా? డైరెక్ట‌ర్స్ డిక్ష‌న‌రీలో వాళ్లెంత గొప్ప‌వాళ్లు అన‌డానికి. ఇక తెలుగు వారిపై శంక‌ర్ ఎప్పుడూ ప్ర‌త్యేక‌మైన అభిమానం చూపిస్తుంటారు. ఆయ‌న సినిమాల‌పై ఎన‌లేని అభిమానాన్ని తెలుగు ఆడియ‌న్స్ ఎప్పుడూ చూపిస్తుంటారు. కానీ త‌మిళ అభిమానులు మాత్రం తెలుగు సినిమాల్ని ఎలా ట్రీట్ చేస్తారు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డ ప‌రిశ్ర‌మ నుంచి తెలుగు సినిమా అంటే థియేట‌ర్లు కేటాయింపులో వివ‌క్ష చూపిస్తుంటారు. నాన్ త‌మిళీయ‌న్ అనే భావ‌న క‌నిపిస్తుంది.

త‌మ హీరోల‌కు, ద‌ర్శ‌కుల‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త తెలుగు వారికి ఇవ్వ‌ర‌నే విమ‌ర్శ చాలా కాలంగా ఉంది. దీన్ని నిర్మూలించాల‌ని శంకర్, సూర్య, ర‌జ‌నీ, క‌మ‌ల్ లాంటి వారు చాలాసార్లు ప్ర‌య‌త్నించారు. కానీ అది పూర్తి స్థాయిలో జ‌ర‌గ‌లేదు. ఇలాంటివ‌న్నీ ఇత‌ర రీజియ‌న్స్ లో త‌మిళ క్రియేటర్స్ కి నెగిటివ్ గా మారుతున్నాయి. అయితే శంక‌ర్ గురించి రాజ‌మౌళి గ‌ర్వంగా మాట్లాడంతో? వాళ్ల‌లోనూ మార్పు క‌ద‌లిక క‌నిపిస్తుంది. రాజమౌళి వ్యాఖ్య‌ల్ని త‌మిళ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు.

Tags:    

Similar News