తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను అందుబాటులో ఉంచుతూ.. 100 శాతం వినోదాన్ని అందించే దిశగా సాగుతోంది 'ఆహా' ఓటీటీ. సరికొత్త సినిమాలతో పాటుగా వెబ్ సిరీసులు - స్పెషల్ టాక్ షోలను స్ట్రీమింగ్ పెడుతోంది. ఈ క్రమంలో ఇటీవల ''3 రోజెస్'' అనే ఆసక్తికరమైన సిరీస్ ను విడుదల చేశారు.
వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి ''త్రీ రోజెస్'' వెబ్ సీరిస్ తో డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టారు. మారుతి షో రన్నర్ గా వ్యవహరించిన ఈ సిరీస్ లో 'Rx 100' బ్యూటీ పాయల్ రాజ్ పుత్ - ఈషా రెబ్బా - పూర్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రచార చిత్రాలతోనే మేకర్స్ ఈ సిరీస్ పై ఆసక్తిని కలిగించారు.
ఆహా ఓటీటీ వేదికగా గత నెలలో విడుదలైన ''త్రీ రోజెస్'' వెబ్ సిరీస్ పర్వాలేదనిపించుకుంది. ఆధునిక స్వతంత్ర భావాలు కలిగిన రీతూ - జాన్వీ - ఇందు అనే ముగ్గురు ఈ జెనరేషన్ అమ్మాయిల జీవితాలతో ముడిపడిన కథ ఇది. ఇందులో ప్రిన్స్ - సంగీత్ శోభన్ - ఇషాన్ - వైవా హర్ష - సత్యం రాజేష్ - హేమ - గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తెలుగు డిజిటల్ స్పేస్ లో ముగ్గురు హీరోయిన్లతో తెరకెక్కించిన తొలి ఫీమేల్ సెంట్రిక్ ఒరిజినల్ సిరీస్ ''త్రీ రోజెస్'' అని తెలుస్తోంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఫన్ - లవ్ - రొమాన్స్ - ఎమోషన్ - డ్రామా కలబోసి రూపొందించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని ఓటీటీ ఆడియన్స్ ఆదరిస్తున్నారు.
ముగ్గురు ముద్దుగుమ్మల అందచందాలు - వైవా హర్ష కామెడీని యూత్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. సన్నీ ఎమ్.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్ - బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటున్నాయి.
రవి నంబూరి ఈ సిరీస్ కు కథ అందించగా.. మ్యాగీ దర్శకత్వం వహించారు. యాక్షన్ కట్ మూవీస్ ఎల్ఎల్పి బ్యానర్ పై 'టాక్సీవాలా' నిర్మాత SKN ఈ ఒరిజినల్ సిరీస్ ను నిర్మించారు.
విజయవంతమైన చిత్రాలతో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకనిర్మాతలు మారుతి - ఎస్ కే ఎన్.. ''3 రోజెస్'' వెబ్ సిరీస్ తో ఓటీటీ రంగంలో కూడా సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు.