స‌ప్త‌గిరిపై అంత బెట్టింగ్ సాహ‌స‌మే!

Update: 2019-04-28 05:36 GMT
`ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌`తో క‌మెడియ‌న్ గా వెలుగులోకి వ‌చ్చాడు స‌ప్త‌గిరి. ఆ సినిమా తెచ్చిన ఐడెంటిటీతో అత‌డు ఏ స్థాయికి ఎదిగాడో తెలిసిందే. అయితే ఆరంభం అస‌లు క‌మెడియ‌న్ అవుతాన‌ని త‌న‌కే తెలియ‌ద‌ని స‌ప్త‌గిరి అన్నాడు. కామెడీ చేయ‌గ‌ల‌న‌ని అనుకోలేద‌ని ఆ క‌న్ఫ్యూజ‌న్ లోంచి బ‌య‌ట‌ప‌డ‌క ముందే `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్‌`లో అవ‌కాశం అందుకున్నాన‌ని చెప్పాడు. తాను న‌వ్వించ‌గ‌ల‌న‌ని.. త‌న‌లో అంత కామెడీ ఉంద‌ని న‌మ్మ‌లేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. కానీ ఆ రెండు సినిమాల్లో స‌ప్త‌గిరి క‌డుపుబ్బా న‌వ్వించ‌డంలో స‌క్సెస‌య్యాడు. `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్` అత‌డి ద‌శ‌దిశ తిప్పేసింది. `వీడేం చేస్తాడు.. ఈ సినిమాలో వ‌ద్దు! అని స‌తాయించాన‌ని చోటా.కె సైతం చెప్పారు అప్ప‌ట్లో. అటుపై ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాక‌.. వ‌రుస‌గా ప‌లు చిత్రాల్లో క‌మెడియ‌న్ గా అవ‌కాశాలు అందుకున్న స‌ప్త‌గిరి కెరీర్ ప‌రంగా పీక్స్ చూశాడు. ఆ త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌లైంది.

క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి అనూహ్యంగా హీరో అయ్యి స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్.. స‌ప్త‌గిరి ఎల్.ఎల్.బి (జాలీ ఎల్‌.ఎల్‌.బి రీమేక్) అంటూ ప్ర‌యోగాలు చేశాడు. ఈ ప్ర‌యోగాలేవీ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. అయినా హీరోగా అత‌డికి ఒక‌దాని వెంట ఒక‌టిగా అవ‌కాశాలొస్తున్నాయ‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. త‌న‌కు ఉన్న క‌మ్యూనికేష‌న్ లో స‌ప్త‌గిరి హీరోగా మ్యానేజ్ చేసేస్తున్నాడు. త‌న స్థాయికి త‌గ్గ‌ట్టు త‌న‌కంటూ ఓ లెవ‌ల్‌ మార్కెట్ ఉంద‌ని తాజా డీల్ ఒక‌టి చెబుతోంది.

ప్ర‌స్తుతం స‌ప్త‌గిరి న‌టించిన‌ `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవిందా` చిత్రాన్ని బ‌య్య‌రు కం ఎగ్జిబిట‌ర్ బ్ర‌హ్మ‌య్య‌ గంప‌గుత్త‌గా వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ని కొనుక్కున్నారు. అందుకోసం ఆయ‌న‌ 3.60కోట్లు వెచ్చించాన‌ని తెలిపారు. ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో బ్ర‌హ్మ‌య్య మాట్లాడుతూ.. టీజ‌ర్ న‌చ్చి సినిమాపై న‌మ్మ‌కంతో కొనేశాను. ఈ సినిమాలో స‌ప్త‌గిరి అద్భుతంగా న‌టించాడు. అడ్వెంచ‌ర్.. సందేశం ఉన్న‌ క‌థాంశం థ్రిల్ కి గురి చేస్తుంది. మే 17న ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ రిలీజవుతోంది. అది చూస్తే 6-9 కోట్ల పెట్టుబ‌డితో తీసిన సినిమా అనిపిస్తుంది`` అని తెలిపారు.. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్.. డివైన్ మూవీ ఇద‌ని తెలిపారు. సీడెడ్ ఎగ్జిబిట‌ర్ కం డిస్ట్రిబ్యూట‌ర్ 33 ఏళ్ల అనుభ‌వం ఉన్న ఆయ‌న‌ రంగస్థ‌లం - ఎఫ్ 2 స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్లు చిత్రాల్ని పంపిణీ చేశాన‌ని తెలిపారు. `స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్` క‌లెక్ష‌న్స్ ని ప్ర‌త్య‌క్షంగా చూశాను.. అందుకే స‌ప్త‌గిరిపై న‌మ్మ‌కంతో కొన్నానని చెబుతున్నారు. ఈ సినిమాని అన్నిచోట్లా  సొంతంగా రిలీజ్ చేస్తానన‌ని తెలిపారు. అయితే స‌ప్త‌గిరిని న‌మ్మి 3.6 కోట్ల పెట్టుబ‌డి పెడుతున్నారు. మినిమంగా అంత పెద్ద మొత్తం షేర్ వ‌సూలు చేయాలి. 4కోట్ల షేర్ తెస్తే లాభాలొచ్చిన‌ట్టే. మ‌రి సప్త‌గిరి రేంజ్ అంత ఉందా? క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన స‌ప్త‌గిరిపై ఇంత బెట్టింగ్ సాహ‌సం కాదా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చా ట్రేడ్ లో సాగుతోంది.
Tags:    

Similar News