ఏపీలో 400 థియేట‌ర్లు మూత‌..నిర్మాత‌ల భ‌య‌మే నిజ‌మైందా?

Update: 2022-07-15 11:30 GMT
ఆన్ లైన్ టిక్కెట్ విక్రయాల‌పై ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన కొత్త జీవో పై హైకోర్టు స్టే విధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ వెబ్ సైట్ ద్వారా  టిక్కెట్లు విక్రంయించాలా? ఎగ్జిబిట‌ర్ల కోరిక మేర‌కు త‌మ‌కు అనుకూలంగా విక్ర‌యాలు  జ‌ర‌గాలా? అన్న అంశం కోర్టు ఫ‌దిలో   ఉంది. ఎవ‌రి  వాద‌న‌లు వాళ్లు వినిపిస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నుంచి విన‌తి ప‌త్రాలు వెళ్లినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు.

ఎట్టి ప‌రిస్థితులో త‌మ వైబ్ సైట్ ద్వారా విక్ర‌యాలు జ‌ర‌గాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. ఈ వ్య‌వ‌హారం ఎప్పుడు తేల్తుందో  క్లారిటీ లేదు. సినీ పెద్ద‌లు సైతం ఈసారి మౌనంగానే ఉన్నారు. టిక్కెట్ల ధ‌ర‌లు పెంచుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించిన పెద్ద‌లు విక్రయాల విష‌యంలో త‌ల దూర్చ‌డం లేదు. దీంతో ఎగ్జిబిట‌ర్లు-ప్ర‌భుత్వం తేల్చుకోవాల్సిన అంశంగా మారింది.

ప్ర‌భుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు  వ‌స్తే   థియేట‌ర్లు మూత ప‌డ‌టం ఖాయ‌మ‌ని నిపుణులు ఇప్ప‌టికే  హెచ్చ‌రించారు.  అయితే అంత‌కు ముందే ఇండ‌స్ర్టీకి-నిర్మాత‌ల‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా దాదాపు 400 థియేట‌ర్లు మూత ప‌డిన విష‌యంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. థియేట‌ర్లో ఆక్యుపెన్సీ త‌క్కువ‌గా ఉంటోన్న కార‌ణంగా థియేట‌ర్ల‌ని తాత్కాలికంగా  మూసి వేసిన‌ట్లు  వెలుగులోకి వ‌చ్చింది.

థియేటర్ నిర్వహణ ఖర్చులు పెరగడం.. తక్కువ మంది ప్రేక్షకులు రావడంతో ఎగ్జిబిటర్లకు నష్టం వాటిల్లుతోంద‌ని ఎగ్జిబిట‌ర్లు ల‌బోదిబో మంటున్నారు. ఏసీ థియేటర్‌లో ఒక్క షోను నడపాలంటే రూ. 5000 మరియు నాన్-ఏసీ థియేటర్లలో రూ. 2000 ఖర్చు అవుతుంది. క్లీనింగ్ మరియు ఇతర ఇతర ఖర్చులు అదనం.  

ఇంత ఎక్కువ ఖర్చులతో.. తక్కువ ఆక్యుపెన్సీతో  నిర్వ‌హించ‌డం భారంగా మార‌డంతో  థియేటర్ మేనేజ్‌మెంట్‌లు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన‌ట్లు తెలుస్తోంది. పైగా ప్ర‌స్తుతం స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ కి లేక‌పోవ‌డంతో అప్ప‌టివ‌ర‌కూ లాక్ వేయ‌డ‌మే ఉత్త‌మంగా భావించి ఈ నిర్ణ‌యం  తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఏపీ వ్యాప్తంగా 1000 కి పైగా థియేట‌ర్లు ఉన్నాయి. అందులో 400 థియేట‌ర్లు ఇప్ప‌టికే  మూత ప‌డితే 600 థియేట‌ర్లు మాత్ర‌మే యాక్టివ్ లో ఉన్నాయి. మూత‌ప‌డిన థియేట‌ర్లు దసరా కి తెరుచుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ప‌రిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఎగ్జిబిట‌ర్లు టిక్కెట్ విక్ర‌యాల వెసులుబాటు కోల్పోతే మ‌రింత అద్వానంగా మ‌రే అవ‌కాశం క‌నిపిస్తుంది. మ‌రి దీనిపై పెద్ద‌లు ఎలాంటి  చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News