హీరోలు.. నిర్మాతలు.. దర్శకులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ట్రెండ్ అయిపోయింది. ఖరీదైన కార్లు.. వాచ్ ల లాంటి గిఫ్టులు ఇస్తూ వారిపై తమ ఇష్టాన్ని చాటుకోవడం ఆనవాయితీ. పర్సనల్ గా ఇది సంతోషం కలిగించే విషయమే అయినా.. వీటితో కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి ఓ సంఘటననే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు నిర్మాత బండ్ల గణేష్.
ఇద్దరమ్మాయిలతో మూవీ షూటింగ్ సమయంలో పూరీ జగన్నాధ్ కి ఓ కాస్ట్లీ లైటర్ ఇచ్చాడు. 1,455 వజ్రాలు పొదిగిన ఈ లైటర్ ఖరీదు జస్ట్ 44 లక్షలు మాత్రమే. బండ్ల గణేష్ ఇచ్చిన బహుమతి అంటూ 2012లో పూరీ జగన్ స్వయంగా ఆ లైటర్ ఫోటోను ట్వీట్ చేశాడు కూడా. అయితే.. ఈ బహుమతి ఇచ్చిన వెంటనే అలర్ట్ అయింది ఎవరో తెలుసా? ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వాళ్లు అంటే ఆశ్చర్యం వేయక మానదు.
44 లక్షల ఖరీదైన బహుమతి ఇవ్వడంతో.. బండ్ల గణేష్ ఇల్లు ఆఫీసులపై దాడి చేసిన ఐటీ అధికారులు.. అకౌంట్ బుక్స్ ను వెరిఫై చేశారట. తనకు లాభాలు అందించిన పూరీ జగన్నాధ్.. లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాడని బండ్ల బహుమమతి ఇస్తే.. తిరిగి ఈ నిర్మాతకే లైఫ్ టైం మెమరీ ఇచ్చేశారు ఐటీ అధికారులు.