టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ లో కూడా స్వీటీ అనుష్కకు చాలానే క్రేజ్ ఉంటుంది. కానీ ఆ క్రేజ్ తగ్గ స్థాయిలో సినిమాలు ఆడిన దాఖలాలు తక్కువ. రీసెంట్ టైమ్ లో అయితే బాహుబలి మినహాయిస్తే.. అనుష్క చేసిన సినిమా ఒక్కటి కూడా ఆడిన దాఖలేలేమీ లేవు. తమిళ్ లో స్టార్ హీరో అజిత్ చేతి ఎన్నై అరిందాల్(తెలుగులో ఎంతవాడు కానీ) నుంచి టాలీవుడ్ మూవీ సైజ్ జీరో వరకు వరుసగా అన్ని ఫ్లాపులే. అనుష్కను సోలోగా నమ్మేసి ఇన్వెస్ట్ చేసేయడం పెద్ద రిస్క్ అనే సంగతి ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది.
పిల్ల జమీందార్ ఫేమ్ డైరెక్టర్ అశోక్.. ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రలో భాగమతి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ సీక్వెన్స్ కోసం భారీ సెట్టింగ్ వేస్తున్నారట. 4.5 కోట్లకు పైగా ఖర్చు కేవలం ఈ ఒక్క సెట్ కోసమే వెచ్చిస్తోందట నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. 400 ఏళ్ల క్రితం పరిస్థితులను రీక్రియేట్ చేసేందుకు ఈ సెట్ ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఇది పీరియాడికల్ చిత్రం కాదని.. సామాజిక చిత్రమేనని మేకర్స్ గతంలో చెప్పినా.. కీలకమైన ఓ సన్నివేశం కోసం మాత్రం ఈ సెట్ అవసరం ఉంటుందని తెలుస్తోంది.
అయితే.. బాక్సాఫీస్ దగ్గర స్వీటీ సినిమాలు పెద్దగా పెర్ఫామ్ చేయని సిట్యుయేషన్స్ లో.. ఈమెపై ఇంత భారీగా వెచ్చించడమంటే చాలా రిస్క్ అంటున్నారు సినీ జనాలు. ఒక్క సెట్ కోసమే 5 కోట్లు పెడితే.. మొత్తం సినిమాకి వీళ్లు కేటాయించిన బడ్జెట్ ఎంతో అని మాట్లాడేసుకుంటున్నారు. టూ మచ్ అనిపిస్తోంది కదూ.