ఫెమీనా కవర్‌పై రష్మిక మందన్న ఫోజ్
తాజాగా ఫెమినా ఇండియా కవర్ ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది రష్మిక మందన్న. అగ్ర హీరోల సినిమాల్లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో అదరగొడుతోంది. యానిమల్, పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించిన రష్మిక మందన్న తదుపరి 'చావా' లాంటి భారీ హిస్టారికల్ డ్రామాలో నటించింది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ భార్య ఏసుభాయి పాత్రలో రష్మిక నటించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇంతకుముందు కాలికి గాయంతో కుంటుకుంటూ చావా ప్రచార కార్యక్రమంలో రష్మిక పాల్గొన్న సంగతి తెలిసిందే.
మరోవైపు రష్మిక మందన్న వరుస ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఫెమినా ఇండియా కవర్ ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. రష్మిక నేటితరంలో దూసుకుపోతున్న గ్రేట్ సూపర్ స్టార్ అంటూ ఫెమీనా కీర్తించింది.
ఈ సంవత్సరాన్ని రష్మిక మందన్నతో ప్రారంభిస్తున్నాం! అంటూ ఫెమీనా ఆనందం వ్యక్తం చేసింది. నేటి ప్రపంచంలో సూపర్ స్టార్ అంటే ఏమిటో రష్మిక రీడిఫైన్ చేస్తున్నారు. పుష్ప 2 అద్భుతమైన విజయంతో, ఈ అందాల సుందరి మన తరంలో అత్యంత ఆరాధించే కథానాయికలలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
తన అసమాన ప్రతిభ, ఆకర్షించే ఉనికి, సరిహద్దులు దాటి ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యంతో రష్మిక లక్షలాది మందిని ఆకర్షిస్తూనే ఉంది. ప్రపంచాన్ని ఆక్రమించుకుంటున్న ఆ స్టార్ గురించి ప్రత్యేక కథనమిది.. అంటూ ఫెమినా ప్రత్యేక స్టోరిని షేర్ చేసింది.