'లైలా' సాంగ్: ముద్దు ఇచ్చుకుందాం బేబీ అంటున్న విశ్వక్..!

‘ఇచ్చుకుందాం బేబీ.. బేబీ.. ముద్దిచ్చుకుందాం బేబీ.. బేబీ..’ అంటూ సాగిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.

Update: 2025-01-23 16:11 GMT

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న యూత్‌ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ''లైలా''. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్ 'సోను మోడల్' కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ‘ఇచ్చుకుందాం బేబీ’ అనే సెకండ్‌ సింగిల్‌ లిరికల్‌ వీడియోని చిత్ర బృందం లాంచ్ చేసింది.

‘ఇచ్చుకుందాం బేబీ.. బేబీ.. ముద్దిచ్చుకుందాం బేబీ.. బేబీ..’ అంటూ సాగిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. లియోన్ జేమ్స్ ఈ సాంగ్ కు మోడ్రన్ స్టయిల్ లో ట్యూన్ కంపోజ్ చేసారు. సింగర్స్ ఆదిత్య ఆర్కే, ఎంఎం మానసి ఉల్లాసంగా ఈ పాటను ఆలపించారు. లిరిసిస్ట్ పూర్ణాచారి సాహిత్యం సాంగ్ కు తగ్గట్టుగా సరిగ్గా కుదిరింది. ప్రధాన జంట మధ్య ప్రేమను, ఇద్దరి మధ్య రొమాంటిక్ భావాలను తెలియజెప్పేలా లిరిక్స్ రాసారు. 'దాసూ.. మాస్ కా దాసూ' అంటూ విశ్వక్ ట్యాగ్ లైన్ కూడా లిరిక్స్ రూపంలో తీసుకొచ్చారు.

అందమైన బీచ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. లిరికల్ వీడియో అయినప్పటికీ, ఫ్రేమ్స్ చూస్తుంటే విజువల్ గానూ చాలా బాగుందనే ఫీల్ కలిగిస్తుంది. విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మల మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఆకాంక్ష శర్మ తన చార్మ్ తో పాటకు అదనపు గ్లామర్‌ను జోడించింది. కురచ దుస్తుల్లో చాలా హాట్ గా కనిపించింది. విశ్వక్ కూడా ఛార్మింగ్ గా కనిపించారు. మొత్తం మీద యూత్ ఫుల్ ఎనర్జిటిక్ బీట్ తో వచ్చిన ఈ ఫుట్ ట్యాపింగ్ నంబర్ అలరిస్తోంది. కాకపోతే అక్కడక్కడా 'దాస్ కా ధమ్కీ'లోని 'ఆల్మోస్ట్ పడిపోయానే పిల్లా' పాటను గుర్తుకు తెస్తుంది. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ పాటకి కూడా పూర్ణాచారినే లిరిక్స్ రాశారు.

''లైలా'' సినిమాలో విశ్వక్ సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఇది యాక్షన్ టచ్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ అని చిత్ర బృందం తెలిపింది. న్యూ ఏజ్ ఫిలిం అయినప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే చాలా క్లీన్ గా తీసినట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 1న 'ఓహో రత్తమ్మ' అనే రాయలసీయ మాస్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే రాసిన ఈ సినిమాకి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. 'లైలా' మూవీ ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Full View
Tags:    

Similar News