హీరోలకు ఒక న్యాయం.. హీరోయిన్లకు ఒక న్యాయమా..?

లేటెస్ట్ గా ఇదే విషయంపై తన కామెంట్స్ తో సర్ ప్రైజ్ చేసింది ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా.

Update: 2025-01-23 21:30 GMT

తెర మీద సినిమా చూసే ప్రేక్షకుడు సినిమాను ఎంటర్టైన్ అయ్యేందుకు కథ కథనాలతో పాటు హీరోలు, హీరోయిన్స్ కంపల్సరీ. ప్రధాన పాత్రదారులంగా కూడా సినిమాకు వారి వారి బెస్ట్ ఇవ్వడం వల్లే ఒక మంచి సినిమా ప్రేక్షకుడి మనసు గెలుస్తుంది. ఐతే స్టార్ ఇమేజ్ వచ్చిన హీరో దశాబ్దాల కెరీర్ ని కొనసాగిస్తారు కానీ హీరోయిన్స్ మాత్రం అలా చేయడం చాలా కష్టం. పట్టు మని పది సినిమాలు చేస్తారో లేదో ఆ హీరోయిన్ ని ఎవరు చూడట్లేదు అని కొత్త హీరోయిన్స్ కి ప్రిఫర్ చేస్తారు.

ముఖ్యంగా ఏజ్ బార్ అయిన హీరోయిన్స్ కి ఛాన్స్ లు రావడం కష్టం. కథానాయికలు కూడా ఇదే విషయంలో ఫైట్ చేస్తుంటారు. ఐతే హీరోల వయసు ఆరు పదులు ఉన్నా కూడా వాళ్లు హీరోగానే చేస్తారు. కానీ హీరోయిన్స్ 40 ప్లస్ అయితే చాలు ఆమెకు సపోర్టింగ్ రోల్స్ ఇచ్చేస్తుంటారు. ఇక సీనియర్ హీరోయిన్స్ అదే 50 ప్లస్ వారికైతే అమ్మమ్మ పాత్రలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కథానాయికలు ఎంతోమంది ఈ విషయంపై తన గొంతు ఎత్తి మాట్లాడగా లేటెస్ట్ గా ఇదే విషయంపై తన కామెంట్స్ తో సర్ ప్రైజ్ చేసింది ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా.

సౌత్ ఆడియన్స్ కు అసలు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు ఆమెది. ఆమె చేసిన బొంబాయి సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే 50 ప్లస్ దాటినా సరే పాత్రల విషయంలో వెనక్కి తగ్గకూడదు అంటుంది మనీషా. 50 ప్లస్ ఏజ్ లో హీరోలు ఇంకా మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు కాబట్టి హీరోయిన్స్ కూడా అదే వరుసలో సినిమాలు చేస్తే తప్పేముంది అంటుంది. వారికి తల్లి, సిస్టర్ రోల్స్ ఇద్దామని ముందే డిసైడ్ అవుతారు. 50 ప్లస్ అయినా కూడా వారు యాక్షన్ పాత్రలు చేయగలరు అంటూ చెప్పుకొచ్చింది మనీషా కొయిరాలా.

సినీ పరిశ్రమలో ఏజ్ అనేది అసలు సమస్య కాదని.. రాబోయే తరాలకు ఆదర్శవంతంగా ఉండేలా చేయాలని అన్నారు. జీవించి ఉన్నంత వరకు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటూ సంతృప్తిగా ఉండాలని తాను అదే ఆశయాన్ని కొనసాగిస్తున్నా అని అన్నారు మనీషా కొయిరాల. బాలీవుడ్ సినిమాల్లో అదరగొట్టిన మనీషా సౌత్ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. క్యాన్సర్ తో పోరాడి గెలిచిన మనీషా లాస్ట్ ఇయర్ హీరామండి వెబ్ సీరీస్ లో నటించింది. వరుస ఛాన్స్ లు వస్తున్నా ఆచి తూచి అడుగులేస్తుంది మనీషా.

Tags:    

Similar News