ఇండస్ట్రీలో 6ఏళ్లు.. కానీ ఫ్యాన్స్ కోరుకుంది అది కాదట!

Update: 2021-06-02 02:30 GMT
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి.. అంటే దక్షిణాది సినీ ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన 'ఫిదా' మూవీతో పరిచయమై.. ఫస్ట్ మూవీకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫిదా సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడి అందరి మనసులు దోచుకుంది. అంతేగాక ఈ నేచురల్ బ్యూటీ విభిన్నమైన సినిమాల ఎంపిక చేసుకుంటూ మంచి నటిగా క్రేజ్ దక్కించుకుంటుంది. ప్రతి సినిమాలో పాత్రకు తగ్గట్లుగా హావభావాలను ఎంతో చక్కగా ప్రదర్శిస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. ఈ చెన్నై భామ ప్రస్తుతం తెలుగులో 'విరాట పర్వం' సినిమా చేస్తోంది. హీరో రానా సరసన నటిస్తున్న ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.

తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమ కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విరాటపర్వంలో సాయిపల్లవి ఒక పేద జానపద కళాకారిణిగా కనిపించనుందట. అంతేగాక రెండోసారి శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీ అనే సినిమా చేసింది. ఈ మూవీలో నాగచైనత్య హీరోగా నటిస్తున్నాడు. అయితే తాజాగా సాయిపల్లవి సినీ కెరీర్ ప్రారంభించి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2015 మే 29న సాయిపల్లవి నటించిన డెబ్యూ మూవీ ప్రేమమ్ విడుదలైంది. తాజాగా 6 సంవత్సరాలు పూర్తవడంతో సినీ ప్రేక్షకులు మరోసారి సాయిపల్లవికి సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో క్రేజ్ బాగానే సంపాదించుకుంది కానీ.. సాయిపల్లవి కెరీర్ పరంగా చాలా హిట్ మూవీస్ - స్టార్ హీరోల సినిమాలు వదులుకుంది.

కానీ వచ్చిన సినిమాలన్ని చేసి ఉంటే ఈపాటికి ఏ స్థాయిలో ఉండేదేమో గాని హిట్ మూవీస్ వదులుకునే సరికి అమ్మడి ఫ్యాన్స్ కొంచం హర్ట్ అయ్యారు. తెలుగులో సాయిపల్లవి కెరీర్ 5ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటివరకు చేసింది 3 సినిమాలే కావడం ఆశ్చర్యం. ఇప్పుడు మరో రెండు సినిమాలు విడుదలకు రెడీ చేసింది. ఫిదా, పడిపడి లేచే మనసు సినిమాలలో సాయి పల్లవి మేకప్ లేకుండా నటించి.. అందరినీ ఫిదా చేసింది. తనకు మేకప్ అంటే అసలు ఇష్టముండదని తెలిపింది. అలాగే మేకప్ వేసుకోవడం వల్ల తన నేచురల్ అందం పోతుందని.. మేకప్ లేకుంటనే బాగుంటానని చెప్పి.. బ్యూటీ యాడ్స్ కూడా వదిలేసింది. ఆ విధంగా ఓవైపు లక్షల్లో సంపాదన ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం సాయిపల్లవి నుండి ఇది కాదంటున్నారు. చూడాలి మరి త్వరలో తెలుగులో స్టార్డం అందుకుంటుందేమో..!
Tags:    

Similar News