ఒమిక్రాన్ టెన్ష‌న్ ఉన్నా 60 కోట్లు తేవాలి!

Update: 2021-12-30 09:35 GMT
ఒమిక్రాన్ ఉన్నా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఆగ‌దు. అమెరికాలో ఎన్ని టెన్ష‌న్లు ఉన్నా కానీ రిలీజ్ విష‌యంలో వెన‌కాడేదే లేదు. అయితే అమెరికా నుంచి ఈ చిత్రం ఎంత వ‌సూలు చేయాలి? అన్న‌ది చూస్తే 100కోట్లు త‌గ్గ‌కుండా వ‌సూల్ చేయాల‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. దానికి కార‌ణం అంత పెద్ద మొత్తంలో ఓవ‌ర్సీస్ హ‌క్కుల్ని విక్ర‌యించ‌డ‌మే.

#RRR విడుదల తేదీ ఖరారు అయినప్పటి నుండి ట్రేడ్ సర్కిల్ లో వేవ్స్ సృష్టిస్తోంది. రాజమౌళి క్రెడిబిలిటీపైనే బయ్యర్లు పెద్ద ఎత్తున బెట్టింగ్ లు వేసారు. ఈ కాలంలోనే అతి పెద్ద మల్టీస్టారర్‌ ఇదే కావడం హైప్ ను మరింత పెంచింది. RRR తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 210 కోట్లు అంటే బాహుబలి 2 తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన దాని కంటే ఎక్కువ. ఇక USA హక్కులను సరిగమ సంస్థ‌ షాకింగ్ నంబర్ కి కొనుగోలు చేసింది. వారు దానిని రూ. 41 కోట్లు. ఇది ఇతర విదేశీ మార్కెట్ లతో సంబంధం లేకుండా ఒప్పందం. అంటే సుమారు 50కోట్ల షేర్ అమెరికా నుంచి వ‌సూల‌వ్వాల‌న్న‌మాట‌.

#RRR USAలో బ్రేక్ ఈవెన్ కి దాదాపుగా 11 మిలియన్ డాల‌ర్లు వసూలు చేయాలి. USAలో బాహుబలి 2 (20 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేసింది. అంటే 11 మిలియన్ డాల‌ర్లు కంటే ఎక్కువ వసూలు చేసింది. USA అనేది నమ్మశక్యం కాని మార్కెట్. కానీ బాహుబలి 2 తర్వాత విడుదలైన సినిమాలేవీ 6 మిలియన్ డాల‌ర్ల‌ను వసూలు చేయలేకపోయాయి. అందుకే ఇప్పుడున్న ఒమిక్రాన్ టెన్ష‌న్ లో USA పంపిణీ సంస్థ చేసిన భారీ సాహ‌సం ఎంత‌వ‌ర‌కూ నెగ్గుకొస్తుంది అన్న‌ది చూడాలి.

#RRR యొక్క మొత్తం వ్యాపారం దాదాపు రూ. 500 కోట్ల‌ నుండి రూ. 600 కోట్ల వ‌ర‌కూ ఉంది. ఒమిక్రాన్ ఉన్నా ఇంకేం ఉన్నా అంత‌కు మించి షేర్ ను రాబ‌ట్టాల్సి ఉంటుంద‌ని అంచ‌నా. మూవీ టీమ్ అయితే ఓవ‌రాల్ గా రూ.1000 కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యంగా బ‌రిలో దిగింద‌ని గుస‌గుస వినిపించింది.

అమెరికాలో ఒమిక్రాన్ వాస్త‌వ ప‌రిస్థితి ఇదీ!

ప్ర‌పంచ దేశాల్ని క‌రోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఒణికిస్తున్న ఈ క్లిష్ఠ స‌మ‌యంలో ఆర్.ఆర్.ఆర్ వ‌స్తోంది. ఇప్ప‌టికే కొన్ని దేశాలు ప‌బ్లిక్ ప్లేసుల‌కు లాక్ వేసాయి. నిన్న‌ ఒక్క‌రోజే అమెరికాలో అర‌మిలియ‌న్ కి పైగా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. డే బై డై ప‌రిస్థితి మ‌రింత క్లిష్టంగా మారుతోంది. ఏ క్ష‌ణ‌మైనా అక్క‌డా లాక్ డౌన్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని మీడియా క‌థ‌నాలు హీటెక్కిస్తున్నాయి. దీంతో అమెరికాలో థియేట‌ర్లు మూత ప‌డటం ఖాయంగా క‌నిపిస్తోందని గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. అదే జ‌రిగితే పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ ప‌రిస్థితి ఏంటి? అన్న‌ది గంద‌ర‌గోళంలో ప‌డింది. ఈ ర‌కంగా మీడియా క‌థ‌నాలు `ఆర్ ఆర్ ఆర్` టీమ్ ని బెంబేలెత్తిస్తున్నాయి.

అయితే వాస్త‌వంగా అమెరికాలో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో దానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ఒక‌టి బ‌య‌ట‌కి వ‌చ్చింది. ప్ర‌స్తుతం అమెరికాకి అతిపెద్ద సెల‌వు సీజ‌న్ ఇది. అక్కడి ప్ర‌జ‌లంతా క్రిస్మ‌స్ వేడుక‌ల్లో బిజీగా ఉన్నారు. డిసెంబ‌ర్ నెల నుంచి అక్క‌డ హ‌డావుడి మొద‌లైపోతుంది. ఆ త‌ర్వాత న్యూ ఇయ‌ర్ వేడుక రోజునే పెద్ద ఎత్తున క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుగుతాయి. అంటే దాదాపు జ‌న‌వ‌రి అంతా సెల‌వులే. మీడియా చెప్పినంత సీన్ అక్క‌డ లేదు. ప్ర‌జ‌లు రోడ్ల మీద తిరుగుతున్నారు. ప్ర‌తీ చోటా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఉంటున్నారు. ఓ మిక్రాన్ ప‌రీక్ష‌ల్ని ప్ర‌భుత్వం ముమ్మ‌రం చేసింది.

ఎక్క‌డి క‌క్క‌డ ప‌రీక్ష‌లు అందుబాటులో ఉండే అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇక అక్క‌డ భార‌తీయుల ప‌రిస్థితి ఏంటి? అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా సెల‌వులు ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాంటి భ‌యాలు ల‌వు. బూస్ట‌ర్ డోస్ తీసుకోవ‌డంలో ముంద‌జలో ఉన్నారు. ఓమిక్రాన్ అంత తీవ్రం కాద‌ని..సోకినా ఆసుప‌త్రికి వెళ్లి వైద్యం పొందే అంత సీరియ‌స్ కాద‌ని..అంత‌గా అందోళ‌న చెందాల్సిన అస‌వ‌రం లేదంటున్నారు. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దంటున్నారు. థియేట‌ర్ల‌ను మూసివేసే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం లేద‌ని...50 శాతం ఆక్యుపెన్సీ ఉండ‌ద‌ని... అలా చేస్తే ఎకాన‌మీ దెబ్బ‌తింటుంద‌ని ఆ కార‌ణంగా `ఆర్ ఆర్ ఆర్` కి అన్ని పాజిటివ్ సైన్ గానే క‌నిపిస్తుంద‌ని అంటున్నారు.




Tags:    

Similar News