ఫోటో స్టోరిః లిప్పులాకులో డబుల్ హ్యాట్రిక్

Update: 2016-09-09 09:48 GMT
అనుకున్నంతా అయింది.. తొమ్మిదో తేదీ రాగానే ఆ దృశ్యం వచ్చి వాలిపోయింది. అక్కడ కనిపించేది వారిద్దరే అయినా.. చేసే పని అదే అయినా.. పోజులు-యాంగిల్స్ మారుతూ ఉంటాయంతే. బేఫికర్ మూవీలో రణవీర్ సింగ్- వాణి కపూర్ ముద్దుల కహానీ గురించే ఇదంతా. ఓ సినిమాకి పబ్లిసిటీ ఎలా చేయాలో.. బాలీవుడ్ కి తెలిసినంతగా దేశంలో మరే ఇండస్ట్రీకి తెలియదని చెప్పాలి. అలాంటిది మూవీలో పాతిక ముద్దు సీన్స్ ఉంటే.. వాటిని పబ్లిసిటీకి ఎంతలా వాడేసుకోవచ్చో చేసి చూపిస్తోంది బేఫికర్ మూవీ యూనిట్.

ఇప్పటికి ఐదు సార్లు మూతి ముద్దులతో సందడి చేసిన ఈ జంట పెట్టుకున్న ఆరో ముద్దు పోస్టర్ ని కూడా బేఫికర్ టీం రిలీజ్ చేసింది. ఓ స్మిమ్మింగ్ పూల్ ఒడ్డున ఎంచక్కా బోర్లా బొజ్జున్న రణవీర్ వాణీకపూర్ లు ఒకరి పెదాలను ఒకరు తాకించేసుకోవడమే కాదు.. చప్పరించేస్తున్నారు కూడా. షర్ట్ లేకుండా ప్యాకుల బాడీని ఈ హీరో చూపిస్తుంటే.. క్లీవేజ్ షోకులను అమ్మడు ఆడియన్స్ కి అంకితం ఇచ్చేస్తోంది.

మూవీ రిలీజ్ డేట్ డిసెంబర్ 9 కి ఇంకా కరెక్టుగా మూడు నెలల టైమ్ ఉంది. మధ్యలో ఇంకో రెండు తొమ్మిదో తారీఖులు వస్తాయ్. రిలీజ్ అయ్యాక ఎలాగూ మొత్తం ముద్దులన్నీ చూసేయచ్చు. ఈ లోపు మరో రెండు లిప్ లాకులను చూసి.. అసలు సన్నివేశాల కోసం ఎదురుచూడాలన్న మాట.
Tags:    

Similar News