ఈ జూన్ వస్తే చాలు.. టాలీవుడ్ కు ఉన్నట్టుండి నీరసం ముంచుకొస్తుంది. అసలే ఈ టైంలో సగటు ప్రేక్షకుడికి థియేటర్లకు వెళ్లేంత ఇంట్రస్ట్ ఉండదు. కాస్తో.. కూస్తో స్టార్ అట్రాక్షన్ ఉంటే ఎలాగో వీలు చేసుకుని అయినా బయలదేరి సినిమా హాల్ కు వెళ్తాడు. కానీ ప్రేక్షకుడికి తీరిక లేనప్పుడు మనమెందుకు హడావుడి పడటమంటూ టాలీవుడ్ కూడా రిలాక్సయిపోయింది.
వీకెండ్ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంటర్ టెయిన్ మెంట్ కోసం సినిమా వైపే చూస్తారు. ఈ వీకెండ్ థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడికి సినిమా పోస్టర్ చూశాక నీరసం రాక మానదు. ఎందుకంటే వాల్ పోస్టర్ పై కనిపించే సినిమాల్లో స్టార్ అట్రాక్షన్ కాదు కదా.. మామూలు అట్రాక్షన్ కూడా కనిపించడం లేదు. అలాగని సినిమాలు రావట్లేదా అంటే అదేం కాదు., ఈ శుక్రవారం ఏకంగా ఏడు సినిమాలు వస్తున్నాయి.
ఈ వారం థియేటర్లలోకి ‘నా లవ్ స్టోరీ’ - ‘శంభో శంకర’ - ‘యుద్ధ భూమి’ - ‘కన్నుల్లో నీ రూపమే’ - ‘సూపర్ స్కెచ్’ - ‘సంజీవని’ - ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలు వస్తున్నాయి. వీటిలో కాస్త బజ్ ఉన్నది ఈ నగరానికి ఏమైంది సినిమాకు మాత్రమే. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పెళ్ళిచూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు ఉన్నాయి. మిగతావన్నీ చాయ్ బిస్కెట్ సినిమాలే.