మహిళపై 78ఏళ్ళ నటుడి లైంగిక వేధింపులు..!

Update: 2022-11-27 01:30 GMT
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి దక్షిణ కొరియా నటుడిగా ఓ యోంగ్-సు గుర్తింపు తెచ్చుకున్నాడు. నెట్ ఫిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన స్క్విడ్ గేమ్ సిరీస్ లో ఓ యోంగ్ నటించి అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో చార్ట్-టాపింగ్ నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్‌లో ఓ యోంగ్ సు ఉత్తమ నటనను కనబరిచాడు.

ఈ సిరీస్ లో ఓ యోంగ్ సు సహాయ నటుడి పాత్రలో నటించాడు. ఈక్రమంలోనే అతడికి  ఈ సిరీస్‌ కు గాను ఉత్తమ సహాయ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. దీంతో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న మొదటి కొరియా నటుడిగా ఓ యోంగ్ సు రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం 78 ఏళ్ల వయసులో ఉన్న ఓ యోంగ్ ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

2017 సంవత్సరంలో తనను లైంగికంగా వేధించినట్లు ఓ యోంగ్ సుపై ఒక మహిళ ఆరోపణలు చేసింది. అయితే ఆమె ఆరోపణలను యోంగ్ సు ఖండించాడు. సదరు మహిళ ఆ ఏడాది డిసెంబర్లోనే ఓ యెంగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అతడిపై ఎలాంటి అభియోగాలను మోపకుండా పోలీసులకు కేసును మూసివేశారు. నాటి ఆ మహిళ ఓ యోంగ్ సుపై న్యాయం కోసం పోరాడుతూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే బాధిత మహిళ మరోసారి ప్రాసిక్యూషన్ సహాయంతో కేసును రీ ఓపెన్ చేయించింది. ఈ కేసులో ఓ యోంగ్ సు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని దక్షిణ కొరియా న్యాయ శాఖ అధికారులు తెలిపారు. ఓ యోంగ్ సు నటించిన ప్రభుత్వ వాణిజ్య ప్రకటనను ప్రసారం చేయడాన్ని నిలిపి వేయాలని సియోల్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖను కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో అతడి నేరం నిరూపణ అయితే కోర్టులో శిక్ష పడే అవకాశం ఉంది. 78 ఏళ్ల ఓ యోంగ్ సు మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడా? లేదా అన్నది మేరకు త్వరలోనే కోర్టు తేల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఒక మహిళ ఐదేళ్లుగా ఓ యోంగ్ సు కు శిక్ష పడాలని కోర్టు చుట్టూ తిరుగుతుండటం మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News