2009 త‌ర్వాత‌ 2019 లో తార‌క్ స్కిప్

Update: 2019-12-31 06:25 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్ రెండు ద‌శాబ్ధాల‌కు చేరువ‌లో ఉంది. ఇప్ప‌టికే కెరీర్ ప్రారంభ‌మై 19ఏళ్లు పూర్త‌యింది. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు.. జ‌య‌ప‌జ‌యాలు చ‌విచూసిన తార‌క్ స్టార్ హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నాడు. 2001లో నటుడిగా కెరీర్ ప్రారంభించి తార‌క్ 19ఏళ్ల‌లో 28 చిత్రాల్లో న‌టించాడు. దాదాపు ప్ర‌తి ఏడాది ఒక సినిమా రిలీజ్ ఉండేలా చూసుకున్నాడు. అయితే ఈ ఏడాది మాత్రం తార‌క్ స్కిప్ కొట్టేసాడు. అస‌లు గ్యాప్ అన్న‌దే లేకుండా సినిమాలు చేయాల్సింది పోయి.. ఏ రిలీజ్ లేకుండా చేసుకోవ‌డం ఫ్యాన్స్ కి షాకిచ్చేదే. అయితే కెరీర్ కి ఇది కీల‌క మ‌లుపునిచ్చే టైమ్. అందుకే మ‌రింత శ్ర‌ద్ద వహించ‌డ‌మే అందుకు కార‌ణ‌ మై ఉండొచ్చు. ప్లాప్ ల‌తో విసిగించ‌డం క‌న్నా గ్యాప్ తీసుకుని మంచి కంటెంట్ ఉన్న సినిమా ని అందించాల‌న్న ఉద్దేశంతోనే తారక్ తొంద‌ర‌ ప‌డ‌కుండా సెల‌క్టివ్ గా ఉంటున్నాడ‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ ఈ స‌మ్మ‌ర్ లో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. 2019 తార‌క్ కెరీర్ లోనే బ్లాంక్ ఇయ‌ర్ అని చెప్పాలి! దీంతోపాటు మ‌రో టాప్ సీక్రెట్ ఒక‌టి రివీలైంది. తార‌క్ ఈ ఏడాదే కాదు 2009లో కూడా ఒక్క సినిమా కూడా చేయ‌ లేదు. అంత‌కు ముందు ఏడాది కంత్రీ అనే చిత్రం లో న‌టించాడు. అయితే ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని అదుర్స్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి కంబ్యాక్ అయ్యాడు. బ‌హుశా ఆ గ్యాప్ క‌రెక్ష‌న్ కోసం అయ్యుండొచ్చు.

2009.. ఆ త‌ర్వాత 2019 లో సినిమా రిలీజ్ చేయ‌క‌ పోవ‌డం అనే దాని పై ఫ్యాన్స్ లో ఆస‌క్తి క‌ర చ‌ర్చ సాగుతోంది. తార‌క్ కి 9 .. 19 క‌లిసొచ్చే నంబ‌ర్లు కాద‌ని అందుకే తొంద‌ర‌ప‌డి ఆ ఏడాది సినిమాలు చేసి ఉండ‌క‌ పోవ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి ఇది నిజ‌మా? లేక కేవ‌లం యాధృచ్ఛిక‌మా? నిజం గానే తార‌క్ 9 సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడా అన్న‌ది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News