ఇంకో మూడు రోజుల్లో రిలీజ్.. ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ అంటూ కౌంట్ డౌన్ నడిపిస్తున్న సమయంలో 90 ఎంఎల్ సినిమాకు పెద్ద చిక్కొచ్చి పడింది. విడుదలకు 48 గంటలు కూడా సమయం లేని తరుణంలో సెన్సార్ బోర్డు ఈ చిత్ర బృందాన్ని చాలా టెన్షన్ పెట్టేసింది. ఈ గురువారమే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. మంగళ వారానికి సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. సినిమాలో హీరో ప్రతి పూటా 90 ఎంఎల్ మందు కొడితే తప్ప బతక లేని పరిస్థితి లో ఉంటాడు. కారణం ఏదైనా సరే.. ఈ సినిమా మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యం లోనే సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి.
90 ఎంఎల్‌కు సెన్సార్ సర్టిఫికెట్ రావడం కష్టమే అని.. ఇప్పుడిప్పుడే సినిమా రిలీజ్ కాక పోవచ్చని.. ఈ వారం అయితే పక్కాగా వాయిదా పడుతుందని గుసగుసలు వినిపించాయి. ఐతే మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. బుధవారం సాయంత్రం సినిమాకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసి రిలీజ్‌కు పచ్చ జెండా ఊపేసింది. ఐతే విడుదల విషయం లో సందిగ్ధత నెలకొని బుకింగ్స్ ఆపేసిన నేపథ్యం లో కొన్ని గంటల్లో విడుదలకు ఏర్పాట్లు చేయడం కష్టమని.. సినిమాను ఒక రోజు వాయిదా వేశారు. గురువారం కాకుండా శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీంతో పాటుగా భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు, అశ్వమేధం లాంటి చిన్న సినిమాలు ఈ వారం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.