ట్రైలర్‌ టాక్‌ : బిగ్‌ బాస్‌ బ్యూటీ హద్దులు దాటింది

Update: 2019-02-09 11:17 GMT
హిందీ బిగ్‌ బాస్‌ తో ఎంతో మంది ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. రెండేళ్ల క్రితం సౌత్‌ లో కూడా బిగ్‌ బాస్‌ ప్రారంభం అయ్యింది. తెలుగు మరియు తమిళంలో బిగ్‌ బాస్‌ ఇప్పటికే రెండు సీజన్‌ లు పూర్తి చేసుకుంది. రెండు సీజన్‌ ద్వారా ఎంతో మంది గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో బిగ్‌ బాస్‌ వల్ల అత్యంత గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ఓవియా. బిగ్‌ బాస్‌ తో వచ్చిన క్రేజ్‌ తో ఈ అమ్మడు తమిళ సినీ పరిశ్రమలో మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది. తాజాగా ఈమె '90 ఎంఎల్‌' అనే బోల్డ్‌ కంటెంట్‌ చిత్రంలో నటించింది.

'90 ఎంఎల్‌' మూవీ ట్రైలర్‌ ను నిన్న విడుదల చేశారు. సినిమాలో ముద్దు సీన్స్‌ హద్దు పద్దు లేకుండా ఉన్నాయి. కేవలం ఓవియా మాత్రమే కాకుండా మరో ముగ్గురు నలుగురు ముద్దుగుమ్మలు కూడా ఈ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం ప్రస్తుతం తమిళనాట పెద్ద సంచలనంగా మారింది. మొన్నటి వరకు పెద్దగా ఈ చిత్రం గురించి ఎవరు మాట్లాడుకోలేదు. కాని ట్రైలర్‌ విడుదలైన తర్వాత బోల్డ్‌ కంటెంట్‌ కారణంగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.

ఓవియాతో పాటు ఇతర ముద్దుగుమ్మలు కూడా ఫుల్‌ స్కిన్‌ షో తో పాటు లిప్‌ లాక్‌ సీన్స్‌ చేయడంతో సినిమాపై యూత్‌ ఆడియన్స్‌ లో ఆసక్తి రేకెత్తుతోంది. అయిదుగురు అమ్మాయిల మద్య సాగే కథతో ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో తమిళ స్టార్‌ హీరో శింబు గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు. ట్రైలర్‌ లోనే శింబు గెస్ట్‌ రోల్‌ పై క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్‌ ఆరంభంలోనే 18 ఏళ్లు మించిన వారు మాత్రమే చూడాలంటూ వేసి మరీ ఈ ట్రైలర్‌ ను పోస్ట్‌ చేశారు. ఓవియా ఈ చిత్రంతో తమిళనాట మరో సంచలనంగా మారడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల్లోనే ఈ ట్రైలర్‌ రెండు మిలియన్‌ ల వ్యూస్‌ ను సొంతం చేసుకోవడం విశేషం.


Full View

Tags:    

Similar News