సెకండ్ ఇన్నింగ్స్ వీర లెవెల్ అంతే..!

కోలీవుడ్ లో కంగువ, బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా చేసిన బాబీ డియోల్ సౌత్ లో కూడా తన మార్క్ చాటుతున్నాడు.

Update: 2025-01-15 15:30 GMT

చాలామంది స్టార్స్ తమ ఫాం కోల్పోయిన తర్వాత మళ్లీ తిరిగి సరైన ట్రాక్ లోకి రావడానికి కాస్త టైం పడుతుంది. చాలా తక్కువమంది తిరిగి ఫాంలోకి వస్తుండగా ఎక్కువమంది అలానే ఫేడవుట్ అవుతున్నారు. ఐతే ఒకప్పటి స్టార్ హీరోలు కాస్తర్ కెరీర్ టర్న్ తీసుకుని ప్రతినాయకుడి పాత్ర చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఆల్రెడీ తెలుగులో జగపతి బాబు హీరోగా కెరీర్ ఫాం కోల్పోగా లెజెండ్ సినిమాతో విలన్ గా మారి అదరగొట్టాడు. అప్పటి నుంచి జగపతి బాబు విలన్ గా వరుస ఆఫర్లతో దూసుకెళ్లాడు.

ఇక ఇదే దారిలో బాలీవుడ్ లో బాబీ డియోల్ కూడా విలన్ గా మారి వరుస ఛాన్స్ లు అందుకుంటున్నాడు. యానిమల్ సినిమాతో బాబీ డియోల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. యానిమల్ ఇచ్చిన కిక్కుతో బాబీ డియో వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటున్నాడు.

తెలుగులో కూడా ఈమధ్యనే డాకు మహారాజ్ తో అలరించాడు బాబీ డియోల్. సినిమాలో తన విలనిజంతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాడు. ఒకప్పుడు లీడ్ రోల్ గా ప్రేక్షకులను మెప్పించిన బాబీ డియోల్ ఇప్పుడు విలన్ గా మారి స్టార్స్ కి ఢీ అంటే ఢీ అనేస్తున్నాడు. కోలీవుడ్ లో కంగువ, బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా చేసిన బాబీ డియోల్ సౌత్ లో కూడా తన మార్క్ చాటుతున్నాడు.

బాలయ్య బాబు హీరోయిజం తెలిసిందే.. అందుకు తగినట్టుగా విలనిజం ప్రదర్శించి ప్రేక్షకులను అలరించాడు బాబీ డియోల్. విలన్ గా ఆయన మార్క్ చూపిస్తూ సత్తా చాటుతున్న బాబీ డియోల్ కి ఒక దానికి మించి మరొకటి ఆఫర్లు వస్తున్నాయి. సౌత్ లో బాబీ డియోల్ రెస్పాన్స్ అతని కెరీర్ కు సూపర్ హెల్ప్ అయ్యేలా ఉంది.

తన సెకండ్ ఇన్నింగ్స్ లో బాబీ డియోల్ అదరగొట్టే ఆఫర్స్ తో దూసుకెళ్తున్నాడు. కెరీర్ మళ్లీ సరైన ట్రాక్ లోకి వచ్చిన బాబీ ఇలానే తన రెండో ఇన్నింగ్స్ ని తిరుగులేని విధంగా కొనసాగించాలని చూస్తున్నారు. మరి బాబీ నెక్స్ట్ సినిమాల లెక్క ఎలా ఉంటుందో చూడాలి. బాబీకి అవకాశాలు లేని టైం నుంచి మళ్లీ ఆఫ్టర్ గ్యాప్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో వస్తున్నాడు. ఇచ్చిన పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తూ వస్తున్న బాబీకి ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పొచ్చు.

Tags:    

Similar News