నెట్‌ఫ్లిక్స్ బిగ్ డీల్స్: టాలీవుడ్‌పై వెయ్యి కోట్లా?

క్రేజీ సినిమాల హక్కులు కొనుగోలు చేసి తనదైన శైలిలో పండగ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ అండర్‌టాగ్‌ ‘నెట్‌ఫ్లిక్స్ పండగ’ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాల అప్‌డేట్‌లను వరుసగా విడుదల చేసింది.

Update: 2025-01-15 12:30 GMT

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త సినిమాల అప్డేట్‌లు హోరెత్తించాయి. ఈ సందర్భంగా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ కూడా తెలుగు సినిమాలకు సంబంధించిన పలు ఓటీటీ డీల్స్ పై అప్డేట్స్ ఇచ్చింది. క్రేజీ సినిమాల హక్కులు కొనుగోలు చేసి తనదైన శైలిలో పండగ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ అండర్‌టాగ్‌ ‘నెట్‌ఫ్లిక్స్ పండగ’ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాల అప్‌డేట్‌లను వరుసగా విడుదల చేసింది.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ తెలుగు సినిమాల హక్కుల కోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. మొత్తం వందల కోట్లు ఖర్చు చేసి పలు హైప్రొఫైల్ సినిమాల స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మొత్తం విలువ సుమారు రూ.1000 కోట్లు పైమాటే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్యాకేజీలో ప్రధాన హైలైట్ పవన్ కల్యాణ్ నటిస్తున్న OG. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌కు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని అంచనా.

అలాగే, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12, నాని నటించిన హిట్ 3: ది థర్డ్ కేస్, నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక రవి తేజ ప్రధాన పాత్రలో భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ జాతర కూడా ఈ లిస్టులో ఉంది.

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న అనగనగా ఒక రాజు వంటి సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్ ప్యాకేజీలో ఉన్నాయి. అలాగే నాని ప్రొడక్షన్ హౌస్‌లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన కోర్ట్, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న మాడ్ స్క్వేర్ కూడా ఈ లిస్ట్‌లో చోటు సంపాదించాయి. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న జాక్ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లో భాగమైంది.

OTT పోటీల నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ తన పెట్టుబడులతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ ను ఏర్పాటు చేస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు హక్కులను సొంతం చేసుకోవడం ద్వారా ప్రేక్షకుల అంచనాలను పెంచుతూ విభిన్నమైన కంటెంట్‌ను అందిస్తోంది. తెలుగు సినిమాలపై నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం స్ట్రీమింగ్ రంగంలో టాలీవుడ్‌కు మరింత బూస్ట్ ఇస్తోంది. మరి రాబోయే ఈ సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో చూడాలి.

Tags:    

Similar News