ట్రైలర్ టాక్: నైంటీ ఎంఎల్ ఆసక్తి రేపుతోందే!

Update: 2019-11-21 08:53 GMT
కార్తికేయ గుమ్మకొండ హీరోగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '90 ML'.  ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహ సోలంకి హీరోయిన్ గా నటించింది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.  క్యాచీ టైటిల్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజే విడుదలైంది.

టైటిల్ కు తగ్గట్టే హీరో తాగుబోతు.  మన హీరో ఎందుకు 'అధికారిక తాగుబోతు' గా మారాడు అనే విషయాన్నీ ట్రైలర్ లో వెల్లడించారు.. "కొందరికి మందు తాగడం సరదా..  మరి కొందరికి అది వ్యసనం.. బట్ మీ బాబుకు అది అవసరం" అంటూ కార్తికేయ ఆరోగ్యం గురించి చిన్నపుడే కార్తికేయ అమ్మకు డాక్టర్ చెప్తారు.  సో ఉగ్గుపాలు.. వుడ్ వర్డ్స్ తరహాలో పెగ్గులు పసి ప్రాయం నుంచే అలవాటు అవుతాయి.  ఇంటర్వ్యూ కు పోతే అక్కడ ఇంటర్వ్యూ చేసే వారికి మన హీరో ఆథరైజ్డ్ డ్రింకర్ సర్టిఫికేట్ చూపిస్తాడు.. "మూడు పూటలా మూడు నైంటీలు తాగాలి సర్" అంటాడు.  హీరో తండ్రి పాత్రలో నటించిన సత్య "ఏ జన్మలో ఏ యాగం చేశారో రాజావారు.. ఈ జన్మలో ఈ యోగంతో పుట్టారు" అంటూ హీరోగురించి నిట్టూరుస్తాడు.

ఇలాంటి హీరోకు తన ప్రేమ విషయంలో ఈ తాగుడే అడ్డంకిగా మారుతుంది.  ఎందుకంటే హీరోయిన్ నేహ కుటుంబం.. ముఖ్యంగా నేహ తండ్రి రావు రమేష్ కు తాగుబోతులంటే అసహ్యం.  ఇక రావు రమేష్ గ్రామంలో ప్రజలందరూ మద్యపానానికి మహా వ్యతిరేకులు.  మరి ఈ సమస్యను కార్తికేయ ఎలా ఎదుర్కొన్నాడు.. తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది థీమ్. సినిమా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే ఉందని చెప్పాలి. ఇక పాటలు ఫైట్లు.. కామెడీ లాంటి రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ దట్టించినట్టు ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. ప్రొడక్షన్ కూడా రిచ్ గానే కనిపిస్తోంది. ఆలస్యం ఎందుకు.. ఈ త్రీ టైమ్స్ డైలీ నైంటీ హీరోను చూసేయండి!


Full View

Tags:    

Similar News