విజయ్ సేతుపతి - త్రిష లీడ్ రోల్స్ లో నటించిన తమిళ సినిమా '96' అక్టోబర్ 4 వ తారీఖున రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో విడుదలకు ముందే ఆకట్టుకున్న ఈ సినిమా రిలీజ్ కాగానే క్రిటిక్స్ ను.. రివ్యూయర్స్ ను క్లీన్ బౌల్డ్ చేసింది. సినిమాకు 4 కంటే తక్కువగా దాదాపుగా ఎవ్వరూ రేటింగ్ ఇవ్వలేదంటే ఇక వాళ్ళను ఏ రేంజ్ లో మెప్పించిందో మనం అర్థం చేసుకోవచ్చు.
క్రిటిక్స్ రివ్యూయర్స్ పేరెత్తితే కొంతమంది అంతెత్తున ఎగిరి పడి బీపీ తెచ్చుకుంటారు కదా. అందుకనే వాళ్ళకోసం రివ్యూయర్స్ ఒపీనియన్ ను పక్కనపెట్టేసి ఆడియన్స్ వైపు నుండి చూద్దాం. ప్రేక్షకులు క్లీన్ బౌల్డ్ కావడమే కాకుండా ఆ టచింగ్ స్టొరీ దెబ్బకు కన్నీరు పెట్టుకుంటూ 'పడం రొంబ నల్లా ఇరుక్కప్పా' అని తమిళభాషలోనే మెచ్చుకుంటున్నారట. ఈ సేతుపతి - త్రిషల లవ్ స్టొరీ తో తమళ ప్రేక్షకులకు దాదాపు పిచ్చెక్కినట్టయిందట. పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ ఊపందుకుంటున్నాయట. 22ఏళ్ళ తర్వాత కలుసుకున్న మాజీ లవర్స్ కథే ఈ '96'.
గోవింద్ మీనన్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని.. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసలు లభిస్తున్నాయట. ఈ సినిమా తెలుగు రైట్స్ దిల్ రాజు తీసుకున్నాడట. త్వరలో ఈ సినిమాలో తెలుగులో రీమేక్ చేస్తారని నాని - సమంతాలు తెలుగులో నటిస్తారని ఫిలిం నగర్ టాక్.