రంగ‌స్థ‌లం సెట్స్ లో 60రోజుల షూట్

Update: 2020-02-03 08:01 GMT
మెగాస్టార్ చిరంజీవి - రామ్ చ‌ర‌ణ్ డ్యూయో ప్ర‌యోగం ప్ర‌స్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక భారీ సెట్ నిర్మాణం చేప‌డితే అనంత‌రం ఆ సెట్ ని షూటింగ్ పూర్త‌య్యాక తొల‌గించాల్సి ఉంటుంది. షూటింగ్ ముగించ‌గానే దానిని కూల్చేయ‌డ‌మో లేదా త‌గ‌ల‌బెట్ట‌డ‌మో చేస్తున్నారు. అయితే .. నిర్మాత‌గా మారిన త‌ర్వాత చ‌ర‌ణ్ ఆలోచ‌నే వేరుగా ఉంది. నిర్మాణ విలువ‌ల ఖ‌ర్చు అదుపుతప్పుతున్న ఈ ట్రెండ్ లో ఆ ఖ‌ర్చును త‌గ్గించేందుకు నిర్మాత చ‌ర‌ణ్ తెలివైన ప్ర‌ణాళిక‌ల్నే సిద్ధం చేస్తున్నారు.

హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్స్ లోని కోకాపేట ప‌రిస‌రాల్లో సైరా సెట్స్ ను.. అలాగే రంగ‌స్థ‌లం కోసం ఇంత‌కు ముందు ఉప‌యోగించుకున్న బూత్ బంగ్లా ఏరియా సెట్స్ ని ఇప్పుడు అవ‌స‌రం మేర చిరు 150 కోసం ఉప‌యోగిస్తున్నార‌ని తెలుస్తోంది. మెగాస్టార్ 152 క‌థానుసారం అవ‌స‌రం మేర సెట్స్ ని రీక‌న్ స్ట్ర‌క్ట్ చేసుకుని తిరిగి వినియోగిస్తున్నారు.

దాదాపు 60 రోజుల పాటు షెడ్యూల్ ని కొర‌టాల ఇదే సెట్స్ లో ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. ఇందులో కొంత టాకీ.. ఫైట్స్ స‌హా కొన్ని పాట‌ల్ని చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే చిరు 150 క‌థాంశం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. దేవాల‌య భూముల స్కామ్ నేప‌థ్యంలో ఉత్కంఠ రేపే క‌థాంశాన్ని కొర‌టాల ఎంచుకున్నారు. సోషియో పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని మెగా ఫ్యాన్స్ కి కానుక‌గా ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. 2020 ద‌స‌రా కానుక‌ గా సినిమాని రెడీ చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌ తో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక ఈ సినిమాకి అవ‌స‌రం మేర విజువ‌ల్ గ్రాఫిక్స్ ని కొర‌టాల ఇన్ స‌ర్ట్ చేయ‌నున్నార‌ట‌.
Tags:    

Similar News