అదీ త్రివిక్రమ్ పవర్.

Update: 2016-05-27 15:30 GMT
యుఎస్ లో తెలుగు సినిమాల మార్కెట్ ప్రధానంగా హీరోల మీదే నడుస్తుంది. ఐతే నితిన్ మరీ పెద్ద హీరో ఏమీ కాదు.. అతడికి ఓవర్సీస్‌ లో అంత మార్కెట్ ఏమీ లేదు. అయినా సరే.. ‘అ..ఆ’ మూవీ అమెరికాలో 130కి పైగా స్క్రీన్లలో రిలీజవుతుండటం విశేషం. ఓవర్సీస్ లో మొత్తంగా ఈ సినిమాను 200కు పైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. ఇదంతా త్రివిక్రమ్ పవరే అనడంలో సందేహం లేదు. త్రివిక్రమ్ సినిమాలంటే హోల్ సం ఫ్యామిలీ ఎంటర్టైననర్లుగా ఉంటాయి. ఈ తరహా సినిమాలు యుఎస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతాయి.

‘అత్తారింటికి దారేది’ దగ్గర్నుంచి త్రివిక్రమ్ మీద అక్కడి ప్రేక్షకులకు బాగా గురి కుదిరింది. ఆ సినిమా దగ్గర దగ్గర 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి డివైడ్ టాక్ వచ్చినా సరే.. మిలియన్ క్లబ్బులో అడుగుపెట్టింది. ‘అ..ఆ’ ప్రోమోలన్నీ కూడా యుఎస్ ఆడియన్స్ ను బాగా ఆకర్షించాయి. ఈ సినిమాకు అక్కడ మంచి బిజినెస్ ఆఫర్లు కూడా వచ్చాయి. దీంతో సినిమాకు ఆటోమేటిగ్గా హైప్ వచ్చేసింది. అమెరికాలో మాత్రమే కాకుండా మిగతా దేశాల్లో సైతం ‘అ..ఆ’ మీద ఆసక్తి బాగానే ఉంది. మిడిల్ ఈస్ట్ లో 40 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. ఒక్క యూఏఈలో మాత్రమే 25 స్క్రీన్లలో సినిమా విడుదలవుతోంది. అన్ని చోట్లా ముందు రోజే ప్రిమియర్ షోలు పడుతున్నాయి. ఈ చిత్రాన్ని బ్లూ స్కై సినిమాస్ ఓవర్సీస్ లో విడుదల చేస్తోంది. ‘బ్రహ్మోత్సవం’ దెబ్బకు బెంబేలెత్తిపోయి ఉన్న ఓవర్సీస్ జనాలకు ‘అ..ఆ’ ఊరట ఇస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News