30 కోట్లు దాటించేసిన త్రివిక్రమ్

Update: 2016-06-02 05:45 GMT
మొత్తానికి దర్శకుడిగా త్రివిక్రమ్ పవర్ ఏంటో మరోసారి రుజువైంది. ‘అఆ’ సినిమా రూ.30 కోట్లకు బిజినెస్ చేయడం విశేషం. అత్యధికంగా నైజాం ఏరియాకు దిల్ రాజు రూ.8 కోట్లు పెట్టి హక్కులు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమా చూసి ఫిదా అయిపోయిన రాజు.. అంత రేటు పెట్టడానికి సందేహించలేదట. హీరో నితిన్ కు నైజాంలో మంచి ఫాలోయింగ్ ఉండటం.. పైగా సెలవు రోజు (తెలంగాణ అవతరణ దినోత్సవం) విడుదలవడమే కాక.. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో ఫస్ట్ వీకెండ్లోనే ‘అఆ’ సగం పెట్టుబడి వెనక్కి తెచ్చేస్తుందని ఆశిస్తున్నాడు రాజు.

ఇక రాయలసీమకు ‘అఆ’ హక్కులు రూ.3.5 కోట్లు పలికాయి. ఓవర్సీస్ రైట్స్ రూ.4.7 కోట్లకు అమ్మడం విశేషం. నితిన్ కెరీర్లోనే అత్యధికంగా ఓవర్సీస్ లో 200 స్క్రీన్లలో రిలీజవుతోంది ‘అఆ’. ఆంధ్రాలో రూ.10 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కర్ణాటక రైట్స్ రూ.2.5 కోట్లకు అమ్మారు. మొత్తంగా బిజినెస్ రూ.30 కోట్లు దాటేసింది. ఇంకా శాటిలైట్ రైట్స్ రూ.6 కోట్లకు అమ్మినట్లు చెబుతున్నారు. ఒక వేళ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి.. వేరే భాషల నుంచి రీమేక్ రైట్స్ కోసం పోటీ వస్తే ‘అఆ’ లెక్క రూ.40 కోట్లు దాటిపోతోంది. తన లాస్ట్ మూవీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ నిరాశ పరిచిన నేపథ్యంలో చాలా కసితో ‘అఆ’ను రూపొందించాడు త్రివిక్రమ్. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1000కి పైగా స్క్రీన్లలో ఈ సినిమా రిలీజవుతోంది.
Tags:    

Similar News