అ..ఆ.. ఆ పోస్టర్ వచ్చేసింది

Update: 2016-05-22 04:34 GMT
నితిన్, సమంత జంటగా నటించిన అ..ఆ.. చిత్రం విడుదల తేదీపై ఇప్పటివరకూ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మొదటగా అనుకున్న మే 6నుంచి వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్న అ..ఆ.. జూన్ నెల తొలివారంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. బ్రహ్మోత్సవం రిజల్ట్ చూశాక.. వచ్చే వారమే తెచ్చేస్తారని అంచనాలు ఏర్పడ్డాయి.

ఇలాంటి రూమర్లకు చెక్ పెట్టేస్తూ.. జూన్ 2న విడుదల అంటూ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ అ..ఆ..కి పోస్టర్స్ ఇచ్చేశారు. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ.. పూర్తిగా మాటల మాంత్రికుడు స్టైల్ లోనే ఉంటుందని ఇప్పటికే అర్ధమైపోయింది. హీరోయిన్ చుట్టూ సినిమా స్టోరీ తిరుగుతుందని.. ట్రైలర్ లోనే రివీల్ చేసేశారు. అయితే.. ఫస్ట్ పోస్టర్ నుంచి నితిన్ ని పెద్దగా హైలైట్ చేయలేదంటూ.. ఫ్యాన్స్ హర్ట్ అవడంతో.. ఇప్పుడా లోటు తీర్చేసింది అ..ఆ.. టీం.

లేటెస్ట్ గా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లు అన్నింటిలో.. నితిన్ నే ప్రధానంగా సెంటర్ చేశారు. రొమాంటిక్ సీన్, డ్యాన్సులు, అల్లరి కుర్రాడిగా.. నితిన్ లుక్స్ అదిరిపోతున్నాయి. చుట్టూ అష్టలక్ష్ముల టైప్ లో సమంత ఫోటలు ఎనిమిది వేసి, మధ్యలో నితిన్ భయపడుతున్నట్లుగా ఉన్న ఫోటో అయితే అదుర్స్ అనాల్సిందే.
Tags:    

Similar News