దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ పనితనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలో భారీతనం అసాధారణంగా ఉంటుంది. అవుట్ పుట్ విషయంలో ఎంతమాత్రం రాజీ పడరు. స్టోరీ బేస్డ్ స్క్రిప్ట్ అయినా... టెక్నికల్ స్టాండార్డ్ ఉన్నతంగా ఉంటుంది. క్వాలిటీ విషయంలో శంకర్ రాజీకి రారు. సినిమాలో భారీతనం కచ్చితంగా కనబడాల్సిందేనని పట్టుబట్టే గ్రేట్ మేకర్. ఈ విషయంలో చాలాసార్లు ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. సినిమా రిలీజ్ లు కూడా చాలా సమయం పడుతుంటుంది. మధ్యలో ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి.
`ఇండియన్-2` ఆ రకంగానూ కొంత వరకూ వెనుకబడిందన్నది వాస్తవం. నిర్మాతలతో విబేధాలు కోర్టు గొడవలు ఇబ్బందికరంగా మారాయి. ఆయన తెరకెక్కిస్తోన్న `ఇండియన్-2` కోర్టు వివాదం నేపథ్యంలో డైలమాలో పడిన సంగతి తెలిసిందే. శంకర్ రాజీకి రాని వ్యక్తిత్వం కూడా ఇందుకు కారణం.
ప్రస్తుతానికి ఆ సినిమా సంగతి పక్కనబెట్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో శంకర్ వేగం మాములుగా లేదు. లాక్ డౌన్ సమయంలో స్క్రిప్ట్ ను సిద్ధం చేయించి రెడీగా పెట్టారు. ఇటీవలే హీరోయిన్ గా కియారా అద్వాణీని కూడా ఫైనల్ చేసారు.
ఇక సంగీత దర్శకుడిగా థమన్ ని ఎంపిక చేయడం అంతే వేగంగా జరిగిపోయింది. మరికొన్ని రోజుల్లోనే ఆన్ సెట్స్ కు వెళ్లడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆరు నెలల్లోనే చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేయాలని పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. శంకర్ స్పీడ్ చూస్తుంటే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏడాది లోగా అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన స్పీడ్ చూసి టాలీవుడ్ సహా కోలీవుడ్ కూడా ఆశ్చర్యపోతుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.