ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశిఖన్నా సౌత్ లో స్లో అండ్ స్టీ అన్నట్లుగా కెరీర్ ను కొనసాగిస్తుంది. కొన్ని ఏళ్లుగా ఆమె కెరీర్ అలా అలా కొనసాగుతూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు తెలుగు లో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పక్కా కమర్షియల్ సినిమా లో నటిస్తోంది. ఈ సినిమాలోనే కాకుండా ఈమె మరిన్ని సినిమాల్లో కూడా నటిస్తుంది. తమిళంలో ఈ అమ్మడు రెండు మూడు సినిమాలు చేస్తోంది. ఇదే సమయంలో ఈమెకు బాలీవుడ్ లో ఒక భారీ సినిమా నుండి ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందుతున్న యోధ సినిమాలో నటించబోతున్నట్లుగా స్వయంగా రాశి ఖన్నా ప్రకటించింది.
రాశి ఖన్నా కెరీర్ ఆరంభించి చాలా కాలం అయ్యింది. కాని అదృష్టం కలిసి రాకపోవడంతో ఆమె ఖాతాలో సూపర్ హిట్ లు పడలేదు. దాంతో ఆమె స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరలేక పోయింది. ముందు ముందు అయినా ఈ అమ్మడు స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంటుందా అనేది చూడాలి. బాలీవుడ్ లో రాశి ఖన్నా నటించబోతున్న యోధ సినిమా లో మెయిన్ హీరోయిన్ గా దిశా పటాని నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుంది. రెండవ హీరోయిన్ అయినా కూడా యోధ వంటి మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించడం అనేది ఖచ్చితంగా మంచి అవకాశంగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యోధ మూవీ కి సాగర్ అంబ్రీ మరియు పుష్కర్ లు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ప్రారంభం అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది నవంబర్ 11, 2022 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. రాశి ఖన్నా 2013 లో మొదటగా హీరోయిన్ గా హిందీ లో నటించింది. ఈమె కెరీర్ హిందీలో ఆరంభం అయినా కూడా అక్కడ ఆశించిన స్థాయిలో మంచి గుర్తింపు రాలేదు. దాంతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. నటిగానే కాకుండా మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకున్న రాశి ఖన్నా సుదీర్ఘ కాలం తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఎలాంటి అవకాశాలు అక్కడ వస్తాయి అనేది చూడాలి. బాలీవుడ్ లో సెకండ్ ఛాన్స్ తో రాశి ఖన్నా ఆనందంలో మునిగినట్లుగా కనిపిస్తుంది. యోధ సినిమా ఆమెకు సక్సెస్ తెచ్చి పెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.